Tollywood Drug Scandal : టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎప్పుడు, ఎలా మొదలైంది.. మళ్లీ తెరపైకి ఎందుకంటే?

డ్రగ్స్ కేసులో సిట్ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత ఈడీ తిరిగి నోటీసులు పంపింది. బుధవారం ఈడీ అధికారులు టాలీవుడ్ కి చెందిన 16 మందికి నోటీసులు పంపారు.

Tollywood Drug Scandal : టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎప్పుడు, ఎలా మొదలైంది.. మళ్లీ తెరపైకి ఎందుకంటే?

Tollywood Drugs Case

Tollywood Drug Scandal : టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం సృష్టిస్తుంది. గత నెలలో 12 మంది నటీనటులకు సిట్ క్లీన్ చీట్ ఇచ్చింది. వీరిలో రవితేజ, పూరీ జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్, సుబ్బరాజు సహా 11 మంది ఉన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు పలుకుబడి ఉన్న పెద్ద తలకాయలను ఒదిలిపెట్టి.. చిన్న చిన్న ఆర్టిస్టులపై ఎక్కువ ఫోకస్ చేసారనే ఆరోపణలు వచ్చాయి.

ఇక ఇదిలా ఉంటే ఈడీ అధికారులు బుధవారం నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్నవారిలో ఇద్దరు కొత్తవారు ఉన్నారు. గతంలో నోటీసులు అందుకున్న 14 మందితోపాటు, రాణా, రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా నోటీసులు ఇచ్చారు. మొత్తం 16 మందికి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

డ్రగ్స్ వ్యవహారం

ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా.. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీకి కూడా పాకింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌‌లో కొంత మంది నటీనటులు కొంత మంది విదేశీయలు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం జూలై 2న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసారు. హైదరాబాద్ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం టాలీవుడ్‌కు చెందిన కొంత మంది సినీ ప్రముఖులను నార్కోటిక్స్ విభాగం వారి ఆఫీసుకు పిలిచి విచారించింది.

అప్పట్లో ఈ కేసు టాలీవుడ్‌లో పెద్ద ప్రకంపనలే పుట్టించింది. ఈ కేసులో హీరో రవితేజ కారు డ్రైవరుతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్ సహా పలువురును విచారించారు. మొత్తంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ పోలీసులు మొత్తంగా 12 కేసులు నమోదు చేసి 30 మందికి పైగా అరెస్ట్ చేసారు. అంతేకాదు 27 మందిని విచారించారు. 12 కేసుల్లో ముందుగా 8 కేసుల్లో మాత్రమే పోలీస్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

డ్రగ్స్ కేసు బయటకు రావడానికి గల కారణాలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ లో ప్రకంపనలు లేశాయి. ఈ కేసు విచారణ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇందులో టాలీవుడ్ తోపాటు శాండిల్ వుడ్ కి చెందిన ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఈ కేసును ఈడీ అధికారులు టేకప్ చేశారు. గత కొద్దీ నెలలుగా దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శాండిల్ వుడ్ నటీమణులు సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారించారు. FSL రిపోర్ట్స్ లో వీరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ కావడంతో అధికారులు విచారణ వేగం పెంచారు.

అక్కడ తీగ లాగితే ఇక్కడ కదిలింది.

బాలీవుడ్ లో తీగ లాగితే శాండిల్ వుడ్, టాలీవుడ్ డొంక కదిలింది. ఇక సుశాంత్ కేసు విచారణ సమయంలో కొందరు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు, ప్రముఖ నటుల భార్యల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ప్రముఖల పేర్లు బయటకు రావడంతో అభిమానుల్లో అలజడి నెలకొంది. ఇక ఆ తర్వాత స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం తిరిగి బుధవారం తెరపైకి వచ్చింది. శాండిల్ వుడ్ స్టార్స్ డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపడటంతోనే ఈడీ తెలుగు పరిశ్రమపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.