Tollywood: నేడు ఫిల్మ్ ఇండస్ట్రీ భేటీ.. విష్ణు-మోహన్ బాబు హాజరు?

తెలుగు సినీ పరిశ్రమ ఆదివారం మరోసారి భేటీ కానుంది. కరోనా ప్రభావం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు..

Tollywood: నేడు ఫిల్మ్ ఇండస్ట్రీ భేటీ.. విష్ణు-మోహన్ బాబు హాజరు?

Tollywood

Tollywood: తెలుగు సినీ పరిశ్రమ ఆదివారం మరోసారి భేటీ కానుంది. కరోనా ప్రభావం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకోసం ఫిల్మ్ ఛాంబర్​లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, స్టూడియో సెక్టార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలను సమావేశానికి ఆహ్వానించారు.

Tollywood : సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వంతో.. వర్మ, చిరు, పవన్.. ఎవరు కరెక్ట్?

గతంలో పలుమార్లు ఇదే సమస్యలపై సినీ పెద్దలు చర్చించగా.. ఈ మధ్యనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో స్టార్ హీరోలు కొందరు భేటీ కాగా.. దాదాపుగా సమస్యలన్నీ పరిష్కార దిశగా అడుగులేసినట్లుగా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి సమావేశమై అన్ని విభాగాలలో సమస్యలు, వాటి పరిష్కారానికి కృషి చేసేందుకే ఈ సమావేశంగా చెప్తున్నారు. సుమారు 200 మందికిపైగా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరై సమస్యలపై చర్చించనున్నారు.

Tollywood Meeting : సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం చివరి సమావేశం.. మెగా మీటింగ్ ఫలించిందా??

కాగా.. తెలుగు రాష్ట్రాలలో సమస్యలపై ఇప్పటి వరకు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్కడ సినీ పెద్దలతో సమావేశం కాలేదు. అయితే ఇప్పుడు తొలిసారి సినీ పెద్దలు మోహన్ బాబు, విష్ణు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. చిరంజీవి, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ సహా ఇతర ప్రముఖులంతా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ ఈ నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేయనున్న క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.