Tollywood : హిట్ కొట్టిన ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటో??

2022 సగం అయిపోయింది. కోవిడ్ దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి అన్ని సినిమాల్ని ఈ సంవత్సరం.......

Tollywood : హిట్ కొట్టిన ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటో??

Tollywood

Tollywood :  2022 సగం అయిపోయింది. కోవిడ్ దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి అన్ని సినిమాల్ని ఈ సంవత్సరం యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. భయం భయంగానే సంక్రాంతి నుంచి కాస్త సినిమాల రిలీజ్ స్పీడప్ చేసిన టాలీవుడ్ పడుతూ లేస్తూ అప్పుడే 6 నెలలు కంప్లీట్ చేసేసుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయనుకున్న సినిమాలు డిజాస్టర్ అయితే అసలు ధియేటర్ దాకా వస్తాయా అనుకున్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

సంక్రాంతికి అతిదిదేవోభవ, 1945, రౌడీబాయ్స్, సూపర్ మచ్చి, హీరో, గుడ్ లక్ సఖి లాంటి చిన్న సినిమాలతో పాటు బంగార్రాజు రిలీజ్ అవ్వగా బంగార్రాజు సూపర్ హిట్ కొట్టి, రౌడీ బాయ్స్, హీరో పర్వాలేదనిపించాయి. తండ్రీ కొడుకుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన బంగార్రాజు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్‌షం కురిపించి కొత్త సంవత్సరాన్ని ఫుల్ ఎంటర్టైనింగ్ గా స్టార్ట్ చేసింది.

అదే స్పీడ్ లో ఫిబ్రవరిలో రవితేజ ఖిలాడి గ్రాండ్ గా రిలీజ్ చేశారు కానీ సినిమా మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన డి.జె టిల్లు మాత్రం అదిరిపోయే హిట్ కొట్టింది. ఫిబ్రవరి 25 న ఫాన్స్ అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యింది. లాలా భీమ్లా అంటూ రానా, పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

Gossips : సెలబ్రిటీల మీద చక్కర్లు కొడుతున్న గాసిప్స్.. నిజమేనా??

మార్చి 4న ఎప్పటినుంచో మాంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయినా యావరేజ్ గా నిలిచింది. యువ హీరో కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ పిసి 524 సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఎంతోకాలంగా వెయిట్ చేసిన ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ వరల్డ్ వైడ్ గా ఎన్నో అంచనాలతో మార్చి 11న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్లాప్ లిస్ట్ లోకే వెళ్ళిపోయింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో 400కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కిన RRR సినిమా మార్చి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ విజయం సాధించి 1200 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది.

ఏప్రిల్ ఫస్ట్ న తాప్సీ లీడ్ రోల్ లో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ పర్లేదు అనిపించింది. ఇక ఎన్నో ఆశలతో మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఏప్రిల్ 8న రిలీజ్ అయిన మూవీ గని, ఏప్రిల్ 29న చరణ్, చిరంజీవి మెగా కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య రెండూ కూడా ఫ్లాప్స్ గానే మిగిలాయి.

మే మొదటి వారంలో సుమ మెయిన్ లీడ్ లో వచ్చిన జయమ్మ పంచాయితీ పర్వాలేదనిపించినా, శ్రీ విష్ణు భళా తందనాన ఫ్లాప్ అయింది. విశ్వక్ సేన్ ఫస్ట్ టైం క్లాస్ రోల్ చేసిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్స్ రాబట్టింది. లాంటిసినిమాలు రిలీజ్ అయితే ..వాటిలో విష్వక్ సేన్ అశోకవనంలో సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక మే 12న వచ్చిన సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా భారీ విజయం సాధించింది. కేవలం తెలుగు సినిమాగా రిలీజ్ అయి 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మే థర్డ్ వీక్ లో రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ యావరేజ్ గా నిలిచినా మే చివరి వారంలో రిలీజ్ అయిన ఫన్ ఫ్రాంచైజ్ మూవీ ఎఫ్ 3 ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి భారీ విజయం సాధించి 100 కోట్లు కలెక్ట్ చేసింది.

Vijay Devarakonda : విజయ్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. వీపుపై విజయ్ దేవరకొండ టాటూ..

జూన్ ఫస్ట్ వీక్ లో అడివి శేష్ హీరోగా రిలీజ్ అయిన మేజర్ సినిమా భారీ విజయం సాధించి ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూలు చేసింది. జూన్ సెకండ్ వీక్ లో నాని, నజ్రియా జంటగా వచ్చిన అంటేసుందరానికి సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులని, యూత్ ని ఆకట్టుకొని మంచి విజయం సాధించింది. జూన్ 17 న రిలీజ్ అయిన విరాటపర్వంకి సాయి పల్లవి క్రేజ్ ఉన్నా ఫ్లాప్ గానే మిగిలింది. అదే రోజు వచ్చిన సత్యదేవ్ గాడ్సే సినిమా బాగున్నా ప్రమోషన్స్ లేక ప్రేక్షకులని థియేటర్లకు రప్పించలేకపోయింది. 24న రిలీజ్ అయిన చిన్న సినిమాలు సమ్మతమే, చోర్ బజార్, 7 డేస్, 6నైట్స్ లాంటి సినిమాల్లో చోర్ బజార్ , సమ్మతమే యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇలా 2022 మొదటి ఆరు నెలలు కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్ వచ్చినా అధిక శాతం విజయాలు వరించి కలెక్షన్స్ విషయంలో కాసులు కురిపించాయి. మరి మిగిలిన ఆరు నెలలు ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.