Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్

ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna :  ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. స్వయంగా ఆయనే ఈ విషయం ప్రకటించారు. గత రెండురోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని… త్వరలోనే సాధారణ కార్యక్రమాల్లో పాల్గోంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : Telangana Police : బండి సంజయ్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు..

అఖండ సినిమా బంపర్ హిట్ అవటంతో బాలయ్య ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. శ్రుతిహాసన్ కధానాయిక. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ విభిన్న కధతో మరో సినిమాలో నటించబోతున్నారు బాలయ్య. దీంతో పాటు వ్యాఖ్యాతగానూ బాలకృష్ణ మరోసారి అలరించనున్నారు. బాలయ్య వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2’ ఆహా ఓటీటీలో ఆగస్టులో టెలికాస్ట్ కానుంది.