RAPO20 : మరో హీరోని విలన్ చేస్తున్న బోయపాటి..

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ హీరో రామ్ కలయికలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రామ్ కెరీర్ లో 20వ సినిమాగా వస్తుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ గురించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో రామ్ ని ఢీ కొట్టేందుకు ఒక యంగ్ హీరోని విలన్ గా మార్చేస్తున్నాడట బోయపాటి.

RAPO20 : మరో హీరోని విలన్ చేస్తున్న బోయపాటి..

RAPO20

RAPO20 : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ హీరో రామ్ కలయికలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ నుంచి వచ్చిన గత రెండు సినిమాలు రెడ్, ది వారియర్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించలేక పోయిని. దీంతో ఈ మూవీతో ఎలైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ చిత్రం రామ్ కెరీర్ లో 20వ సినిమాగా వస్తుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ గురించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో రామ్ ని ఢీ కొట్టేందుకు ఒక యంగ్ హీరోని విలన్ గా మార్చేస్తున్నాడట బోయపాటి.

RAPO20: రామ్ కోసం బోయపాటి ‘యాక్షన్’ ప్లాన్ షురూ!

లెజెండ్ సినిమాతో ఫ్యామిలీ హీరో జగపతిబాబుని విలన్ చూపించి ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ పరిచయం చేశాడు. తాజాగా అఖండ మూవీలో కూడా మరో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ని పవర్ ఫుల్ విలన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక ఇప్పుడు రామ్ సినిమా కోసం టాలీవుడ్ లవర్ బాయ్ ని విలన్ చేయబోతున్నాడు. ‘నీకు నాకు డాష్ డాష్’ మూవీతో పరిచమై బస్ట్ స్టాప్, రొమాన్స్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ సెసిల్, రామ్ కి విలన్ గా బోయపాటి సినిమాలో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.

అయితే ఈ విషయం గురించి మూవీ టీం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ‘నేను శైలజ’ సినిమాలో రామ్, ప్రిన్స్ కలిసి నటించారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో రామ్ తో కలిసి చిందులేసినట్లు సమాచారం. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.