Tollywood Heroes : నాన్ స్టాప్ నాలుగు సినిమాలు..

కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీలో యాక్టివిటీస్ అన్నీ స్లో అయ్యాయేమో కానీ.. స్టార్లు మాత్రం ఫుల్ స్పీడ్ పెంచేశారు..

10TV Telugu News

Tollywood Heroes: కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీలో యాక్టివిటీస్ అన్నీ స్లో అయ్యాయేమో కానీ.. స్టార్లు మాత్రం ఫుల్ స్పీడ్ పెంచేశారు. ఆపసోపాలు పడుతూ సంవత్సరానికి ఒక్క సినిమా చేసే హీరోలు ఇప్పుడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. సీనియర్ల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ నాలుగు సినిమాల్ని లైనప్ చేసిన స్టార్లెవరో డీటెయిల్డ్‌గా చూద్దాం.

టాలీవుడ్ హీరోలు స్పీడప్ అయ్యారు. సంవత్సరానికి ఒక్క సినిమా కాదు.. ఒకేసారి 4 సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఏదో చిన్న హీరోలు కాదు.. స్టార్ హీరోలే ఏకంగా నాలుగు సినిమాలతో నాన్ స్టాప్ వర్క్ చేస్తూ ఎంగేజ్ అయిపోతున్నారు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’ ఇలా మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్.. ఇప్పుడు నాన్ స్టాప్‌గా నాలుగో సినిమాని స్టార్ట్ చేసేశారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, ప్రభాస్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ‘ప్రాజెక్ట్ – కె’ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది.

Prabhas : ‘ప్రాజెక్ట్ – కె’.. టైటిల్ అందులోనే ఉందంటగా..!

మెగాస్టార్ చిరంజీవి కూడా నాలుగు సినిమాలతో లైనప్ ఎరేంజ్ చేసుకున్నారు. సోషల్ మెసేజ్‌కి కమర్షియాలిటీని యాడ్ చేసే కొరటాల శివ, కథకి- కథనానికి ఇంపార్టెన్స్ ఇచ్చే మోహన్ రాజా, గ్రాండియర్ – యాక్షన్‌తో సినిమాలు చేసే మెహర్ రమేష్, సింపుల్‌గా ఆడియన్స్ కోసం సినిమాలు చేసే బాబీ.. ఇలా అసలు ఎక్కడా మ్యాచ్‌కాని కాంబినేషన్స్‌తో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. చిరంజీవి – రామ్ చరణ్ మల్టీస్టారర్‌గా కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న‘ఆచార్య’ సినిమా షూటింగ్ కోకాపేట్‌లో జరుగుతుంది.

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఫుల్ స్పీడ్ మీదున్నారు. సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న పవర్‌స్టార్ ..కోవిడ్‌తో ప్లాన్ డిజాస్టర్ అయినా.. సినిమాల విషయంలో మాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. ఆల్రెడీ సాగర్ చంద్ర డైరెక్షన్లో రానాతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో భీమ్లా నాయక్ క్యారెక్టర్ చేస్తున్న పవన్ కళ్యాణ్, క్రిష్‌తో ఫొక్లోర్ కాన్సెప్ట్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ఈ రెండే కాకుండా హరీష్ శంకర్‌తో, త్రివిక్రమ్‌తో మరో సినిమా లైనప్ చేశారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ గా పవర్‌స్టార్..

మరో సీనియర్ హీరో బాలయ్య బాబు అయితే సోలో గానే దూసుకెళుతున్నారు. ‘అఖండ’ కి బాగా టైమ్ తీసుకున్న బాలకృష్ణ, మలినేని గోపీచంద్‌తో నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేశారు. ఈ రెండిటితో పాటు అనిల్ రావిపూడితో మరో క్రేజీ మూవీ, పూరీతో మరోసారి తన కాంబినేషన్‌ని రిపీట్ చేస్టున్నట్టు రీసెంట్‌గానే అనౌన్స్ చేశారు బాలకృష్ణ.

అక్కినేని హీరో నాగ చైతన్య కూడా కెరీర్‌లోఎప్పుడూ లేనంత స్పీడ్ చూపిస్తున్నారు. సినిమాల విషయంలో పెద్దగా దూకుడు చూపించని నాగ చైతన్య.. ఇప్పుడు ఏకంగా 4 సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. విక్రమ్ కుమార్‌తో ‘థాంక్యూ’, ఆమిర్ ఖాన్‌తో బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’, ‘బంగార్రాజు’ సీక్వెల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు చై. ఈ సినిమాలతో పాటు శేఖర్ కమ్ములతో ‘లవ్ స్టోరీ’ రిలీజ్‌కి రెడీగా ఉంది.

Balakrishna : అఖండ‏లో అదే హైలెట్..!

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా తనకంటూ ట్రెండ్ క్రియేట్ చేసుకున్న శర్వానంద్ కూడా 4 సినిమాల్ని లైనప్ చేశారు. మొన్నీమధ్యే అజయ్ భూపతితో ‘మహా సముద్రం’ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న శర్వానంద్.. లేటెస్ట్‌గా ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ సినిమా షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈ సినిమాలతో పాటు ‘ఒకే ఒక జీవితం’ మూవీతో పాటు పి.ఎస్. వెంకట్ డైరెక్షన్లో మరో సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది.

4 సినిమాలతో బిజీగా ఉన్న మరో హీరో నాగ శౌర్య. ఆర్చరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ‘లక్ష్య’ తో పాటు, లక్ష్మీ సౌజన్య డైరెక్షన్లో ‘వరుడు కావలెను’ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు ‘పోలీస్ వారి హెచ్చరిక’ సినిమాతో పాటు అనీష్ కృష్ణ డైరెక్షన్‌లో మరో సినిమా కూడా షూటింగ్‌లో బిజీగా ఉన్నాయి.

10TV Telugu News