Web Series : ఓటీటీలోనూ సత్తా చాటుతాం..

వెండితెర మీద సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు వెబ్ సిరీస్‌లతో సందడి చెయ్యబోతున్నారు..

Web Series : ఓటీటీలోనూ సత్తా చాటుతాం..

Tollywood Heroes

Web Series: టాలీవుడ్ స్టార్ హీరోలంతా కొత్త రూట్‌ని ఫాలో అవుతున్నారు. ఇన్నాళ్ళు.. సినిమాలు.. అడ్వర్టైజ్ మెంట్లకే పరిమితం అయిన తెలుగు స్టార్స్.. ఇప్పుడు వెబ్ సిరీస్‌లవైపు చూస్తున్నారు. కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మన టాలీవుడ్ హీరోయిన్లు వెబ్ సిరీస్‌లతో దుమ్మురేపుతున్నారు.

Stars Workout : కండల వెనుక కష్టం..

ఇన్నాళ్లు బాలీవుడ్‌‌కే పరిమితం అయిన వెబ్ సిరీస్ మానియా ఇప్పుడు టాలీవుడ్‌ను చేరింది. టాలీవుడ్‌లో కూడా హీరోలు వెబ్ మూవీస్ వైపు చూస్తున్నారు. రీసెంట్‌‌గా అక్కినేని హీరో నాగచైతన్య విక్రమ్ కె కుమార్ డైరక్షన్‌లో ఓ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ కోసం చేయబోతున్నటు తెలుస్తోంది. ఒకో ఎపిసోడ్ 40 నిమిషాల డ్యూరేషన్‌తో ఎనిమిది ఎపిసోడ్స్ తెరకెక్కించబోతున్నారు. చిత్రమేమిటంటే హారర్ సినిమాలకు దూరంగా ఉండే చైతూ.. హారర్ కాన్సెప్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ‘థాంక్యూ’ షూటింగ్‌లో ఉన్నారు ఈ ఇద్దరు. అది కంప్లీట్‌కాగానే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.

Naga Chaitanya : చైతుతో విజయ్ సినిమా..

మరో వైపు దగ్గుబాటి హీరోలు.. బాబాయి అబ్బాయిలు.. వెంకటేష్ – రానా కలిసి ఏకంగా హిందీ వెబ్ మూవీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ప్రొడ్యూసర్ సురేష్ బాబు ప్రకటించారు. ఇప్పటి వరకూ సినిమాలకే పరిమితం అయిన సీనియర్ హీరో వెంకీ.. అటు అన్నింటిలో ఓ చేయి వేసిన రానా కలిసి వెబ్ మూవీ చేస్తే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. హిందీతో పాటు.. సౌత్ లాంగ్వేజెస్‌లో కూడా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది. నెట్ ప్లిక్స్ కోసం చేయబోతున్న ఈ వెబ్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుంది.

Venky – Rana : బాబాయ్ – అబ్బాయ్‌.. మధ్యలో నిషా..

ఇక త్వరలో కింగ్ నాగార్జున కూడా వెబ్ సిరీస్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోగా.. నిర్మాతగా, హోస్ట్‌గా.. ఇలా చాలా రకాలుగా తన సత్తా చాటుకున్న నాగ్, ఇప్పుడు వెబ్ సిరీస్ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ‘బిగ్ బాస్ సీజన్ 5’ ను హోస్ట్ చేస్తున్న ఈ హీరో.. అటు సినిమాలు చేసుకుంటూనే.. ఇటు కొత్త వెబ్ మూవీ కోసం.. కొత్త డైరెక్టర్‌కు ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్.. త్వరలో షూటింగ్‌లో పార్టిసిపెట్ చేసే అవకాశం ఉంది.

Bangarraju : ‘బంగార్రాజు’ స్టార్ట్ అయ్యాడు.. ఆనందంలో అక్కినేని అభిమానులు..

అటు ‘ఫ్యామిలీ మెన్’ ఫస్ట్ సిరీస్‌లో నటించి మెప్పించిన యంగ్ హీరో సందీప్ కిషన్.. సెకండ్ సీజన్‌లో కనిపించలేదు. ఇప్పుడు మూడో సీజన్‌లో సందీప్ సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు దర్శకద్వయం రాజ్ – డీకేలు డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ మూవీ పార్ట్-3 2022 లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. టాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది ఇప్పటికే వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్నారు. సక్సెస్‌పుల్‌గా వెబ్ మూవీస్‌లో నటిస్తున్నారు. సమంత, తమన్నా, కాజల్ లాంటి స్టార్స్ ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్‌లు.. చేస్తూ.. దుమ్ము రేపుతున్నారు.

Annaatthe First Look : ‘అన్నాత్తే’ లుక్ అదిరిందిగా..!

టాలీవుడ్ హీరోయిన్లంతా ఇప్పటికే వెబ్ సిరీస్ బాట పట్టారు. స్టార్ హీరోయిన్ సమంత ఇటు సినిమాలు చేస్తూనే.. రీసెంట్‌గా ఫస్ట్ టైమ్ ‘ఫ్యామిలీ మెన్ 2’ లో నక్సల్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సిరీస్ వల్ల కొన్ని కాంట్రవర్సీలు కూడా ఫేస్ చేశారు సమంత. అంతే కాదు రీసెంట్‌గా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘సామ్ జామ్’ సెలబ్రెటీ షో ను కూడా హోస్ట్ చేసింది సమంత. ఇక త్వరలో మరికొన్ని వెబ్ మూవీస్ కూడా చేసే అవకాశం ఉంది.

Kota Srinivasa Rao : కొత్త సినిమాలో కోట లుక్.. ఊపిరి ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటా..

ఇటు మరో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా కూడా రీసెంట్ గా ‘లెవంత్ అవర్’ వెబ్ మూవీని సక్సెస్‌ఫుల్‌గా చేసింది. ఈ వెబ్ సిరీస్‌తో ఆహాలో సందడి చేసింది తమన్నా.. ఆ తరువాత ‘నవంబర్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌తో అందరినీ మెప్పించింది. ఇటు సినిమాలు చేసుకుంటూనే అటు బుల్లితెరపై హడావిడిచేస్తున్న తమ్మూ.. ప్రస్తుతం ‘మాస్టర్ చెఫ్’ అవతారం ఎత్తింది.