టాలీవుడ్ హీరోలు తయారవుతున్నారు..

  • Published By: sekhar ,Published On : September 18, 2020 / 06:55 PM IST
టాలీవుడ్ హీరోలు తయారవుతున్నారు..

Tollywood Heroes Workouts: లాక్‌డౌన్ కారణంగా గత ఐదు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి.. ఉగాది, సమ్మర్‌కు షెడ్యూల్ వేసుకున్న సినిమాలు విడుదల కాలేదు.. దసరా, దీపావళి సంగతి చెప్పక్కర్లేదు.. కట్ చేస్తే సెప్టెంబర్ నుంచి టాలీవుడ్‌లో షూటింగుల సందడి స్టార్ట్ అయింది.. కొంతమేర బ్యాలెన్స్ ఉన్న సినిమాలు పట్టాలెక్కాయి..


కరోనా కారణంగా అనుకోకుండా దొరికిన ఖాళీ సమయాన్ని స్టార్స్ అందరూ వాయిదా వేసిన పనులు చేస్తూ నచ్చిన పనులు నేర్చుకుంటూ.. ఫిట్ నెస్‌పై మరింత ఫోకస్ పెట్టారు. కొత్త సినిమాలకోసం జిమ్‌లో గంటలతరబడి కసరత్తులు చేస్తున్నారు.


మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న ‘క్రాక్’ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్న రవితేజ బాడీని మరింత బిల్డ్ చేసుకుంటున్నాడు.


యంగ్ హీరో నితిన్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. లాక్‌డౌన్ కారణంగా పెళ్లి సింపుల్‌‌గా చేసుకోవడంతో పాటు హనీమూన్‌కి వెళ్లే అవకాశం కూడా లేకపోయింది. దీంతో నితిన్ జిమ్ లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. స్కిప్పింగ్ ఆడుతున్న వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, చంద్రశేఖర్ యేలేటితో ‘చదరంగం’(వర్కింగ్ టైటిల్) చిత్రాల్లో నటిస్తున్నాడు నితిన్.


మరో యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా జిమ్‌లో గట్టి కసరత్తులు చేస్తున్న పిక్స్ వైరల్ అయ్యాయి. కొద్ది నెలల విరామం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ షూటింగులో జాయిన్ అయ్యాడు. ఇటీవలే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమా కమిట్ అయ్యాడు అఖిల్. వీరితో పాటు సుధీర్ బాబు, నిఖిల్ వంటి పలువురు టాలీవుడ్ హీరోలు తమ కొత్త సినిమాల కోసం కసరత్తులు చేస్తున్నారు.