Repeated combos : హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్న హీరోలు..

ఆడియన్స్ ని ధియేటర్ల వరకూ రావాలంటే సినిమాలో స్టార్ కాస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్పెషల్లీ హీరో, హీరోయిన్ కాంబినేషన్. హీరో పక్కన సెట్ అయ్యే హీరోయిన్ ఉండాలి. ఒకవేళ ఆ కాంబినేషన్..............

Repeated combos :  హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్న హీరోలు..

Heroins

Repeated combos :  ఆడియన్స్ ని ధియేటర్ల వరకూ రావాలంటే సినిమాలో స్టార్ కాస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్పెషల్లీ హీరో, హీరోయిన్ కాంబినేషన్. హీరో పక్కన సెట్ అయ్యే హీరోయిన్ ఉండాలి. ఒకవేళ ఆ కాంబినేషన్ సెట్ అయ్యి హిట్ కొట్టారా ఆ హీరోయిన్ నే ఎక్కువ రిపీట్ చేస్తుంటారు హీరోలు. కలిసొచ్చిన హీరోయిన్ అని, కెమిస్ట్రీ బాగా కుదిరిన భామ అని, గోల్డెన్ లెగ్ అని, లక్కీ ఛామ్ అని హీరోయిన్స్ ని రిపీట్ చేస్తుంటారు మేకర్స్. తాజాగా చాలా మంది హీరోలు తమ హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్నారు.

గోపీచంద్ తో జిల్, ఆక్సిజన్ సినిమాల్లో కలిసి నటించారు. తాజాగా మారుతి పక్కా కమర్షియల్ సినిమాలో ఈ జంట మరోసారి కలిసి నటించారు. జిల్ సినిమాతో హిట్ కొట్టిన ఈ ఇద్దరూ పక్కా కమర్షియల్ తమ రిపీట్ కాంబినేషన్ తో ఆ కెమిస్ట్రీని పండించి పక్కా హిట్ కొట్టబోతున్నారు.

మహర్షిలో పూజాహెగ్డేతో కలిసి హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ తో చేసే సినిమాలో కూడా పూజానే సెలక్ట్ చేసుకున్నారు. త్రివిక్రమ్ తో కూడా బ్యాక్ టూ బ్యాక్ మూడో సారి సినిమా చేస్తోంది పూజాహెగ్డే.

Ap Online Movie Tickets : సినిమా టికెట్ల అమ్మకం.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు..

రామ్ చరణ్ కూడా తన హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీతో అంతకుముందు చేసిన వినయవిధేయరామ అంతగా వర్కవుట్ కాకపోయినా ఇద్దరికీ స్క్రీన్ ప్రజెన్స్ బావుండడంతో పాటు పాన్ ఇండియా మార్కెట్ కి పనికొస్తుందని మరోసారి తన మూవీలో హీరోయిన్ గా కియారానే ఫైనల్ చేశారు. శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా నటిస్తుంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మహానటి సినిమాలో కాసేపు సమంతతో కలిసి ప్రేమికులుగా అక్కడక్కడా కనిపించారు. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ లో శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో రోమన్ చేయనున్నారు.

న్యాచురల్ స్టార్ నాని తన హీరోయిన్స్ ని రెగ్యులర్ గా రిపీట్ చేస్తూనే ఉంటారు. గతంలో నివేద థామస్. మొన్న సాయి పల్లవి, ఇప్పుడు కీర్తి సురేష్ ఇలా కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నందు నాని. నేను లోకల్ సినిమాలో జంటగా కనిపించిన నాని, కీర్తిసురేష్ ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కుతున్న దసరా సినిమాలో కూడా జంటగా కనిపించబోతున్నారు.

నాగచైతన్య కూడా హీరోయిన్స్ ని రెగ్యులర్ గా రిపీట్ చేస్తున్నారు. గతంలో సమంతతో కలిసి నాలుగు సినిమాలు చేశాడు. చైతన్య, రాశిఖన్నా జంటగా ఆల్రెడీ వెంకీ మామ సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం థాంక్యూ సినిమాలో మరోసారి కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా స్టార్ట్ చేసిన సినిమాలో కూడా తన లక్కీ హీరోయిన్ తోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. బంగార్రాజులో యంగ్ హీరోయిన్ కృతి శెట్టితో సూపర్ డూపర్ కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో విక్రమ్ ప్రభు డైరెక్షన్లో మొదలుపెట్టిన బైలింగ్వల్ సినిమాలో హీరోయిన్ గా కృతినే ఫిక్స్ చేసుకున్నారు నాగచైతన్య.

Tollywood : హిట్ కొట్టిన ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటో??

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సూపర్ హిట్లు కొడుతున్న మెగాస్టార్ చిరంజీవి కూడా తన హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నారు. మెహర్ రమేష్ తో చేస్తున్న తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ భోళా శంకర్ లో హీరోయిన్ గా తమన్నానే ఫిక్స్ చేసుకున్నారు. సైరా సినిమాలో చిరంజీవిని ప్రేమించే క్యారెక్టర్ చేసిన తమన్నా మరోసారి భోళా శంకర్ లో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.