Tollywood Hero’s : టాలీవుడ్ హీరోల ఇళ్ల ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

తెలుగు స్టార్ హీరోలు హైదరాబాద్ లో భారీ బడ్జెట్ తో కట్టుకున్న ఇళ్లలో ఉంటున్నారు. మన స్టార్ హీరోలు నివసించే ఇళ్ల ధర తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం.......

Tollywood Hero’s : టాలీవుడ్ హీరోల ఇళ్ల ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

Houses

Tollywood Hero’s :  మన సెలబ్రిటీలు వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు సంపాదిస్తారు. టాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా వాళ్ల స్టార్ డంని బట్టి రెమ్యునరేషన్స్ తీసుకుంటారు. వాళ్ళు వాడే బట్టలు, వాచ్ లు, కార్లే చాలా ఖరీదని అనుకుంటాము. ఇవే ఇంత ఖరీదైనప్పుడు స్టార్ హీరోలు నివసించే ఇల్లు ఎంత రిచ్ గా ఉంటుందో ఆలోచించండి. తెలుగు స్టార్ హీరోలు హైదరాబాద్ లో భారీ బడ్జెట్ తో కట్టుకున్న ఇళ్లలో ఉంటున్నారు. మన స్టార్ హీరోలు నివసించే ఇళ్ల ధర తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.

Pushpa : ‘పుష్ప’ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. దుబాయ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్?

హైదరాబాద్‌లోని ఖరీదైన ప్లేసుల్లో అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఇళ్లల్లో మన స్టార్ హీరోలు నివసిస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు ఇళ్లలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఆ ఇళ్లను చూస్తే మనకి కళ్ళు తిరగడం గ్యారెంటీ. అలాంటిది వాటి ధర తెలిస్తే షాక్ అవుతాం. కొన్ని ఆన్‌లైన్ మీడియాలు చెప్పిన నివేదికల ప్రకారం మన స్టార్ హీరోల ఇళ్ల ధరలు ఇలా ఉన్నాయి.

Salman Khan – Katrina Kaif: వైరల్‌గా మారిన సల్మాన్ – కత్రినాల పెళ్లి వీడియో

రెండు సంవత్సరాల క్రితమే కరోనా ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఇల్లు కట్టుకున్నారని మన అందరికి తెలుసు. అప్పుడు ‘అల వైకుంఠపురంలో’ సినిమా సక్సెస్ మీట్ లో అల్లుఅరవింద్ అల్లు అర్జున్ ఇంటి గురించి మాట్లాడుతూ నీ ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్ కట్టడానికి నాకు తడిసి మోపిడయిందని అన్నారు. దాని బట్టి మీరే అర్ధం చేసుకోండి మొత్తం ఇంటి ధర ఏ రేంజ్ లో ఉంటుందో. అల్లు అర్జున్ దాదాపు 100 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నాడు.

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి హైదరాబాద్‌లో 60 కోట్ల రూపాయల విలువైన అతి విలాసవంతమైన బిల్డింగ్ ఉంది.

టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాల్లోనే కాకుండా, బిజినెస్ లలో కూడా బాగా సంపాదించారు. అక్కినేని నాగార్జున తన భార్య అమల మరియు కుమారుడు అఖిల్ తో కలిసి 40 కోట్ల రూపాయల విలువైన లావిష్ హోమ్‌లో నివసిస్తున్నారు. నాగ చైతన్య విడిగా మరో ఇంట్లో ఉంటున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు తమ కుటుంబ సభ్యులందరితో కలిసి 40 కోట్ల రాజభవనం లాంటి ఇంట్లో నివసిస్తున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోధ్కర్ మరియు పిల్లలతో కలిసి 28 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో నివసిస్తున్నారు. ఇదే రేంజ్ లో మరో ఇల్లు కూడా మహేష్ కి ఉంది.

ఇక ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ 2019లో కొత్త ఇంట్లోకి మారాడని మన అందరికి తెలుసు. ఆ ఇంటి విలువ దాదాపు 15 కోట్లని సమాచారం.

ఇక మిగిలిన హీరోలు కూడా కోట్లలో విలువ చేసే బంగ్లాలలో నివసిస్తున్నారు.