MAA Elections: ‘మా’ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. అక్టోబర్ 10న పోలింగ్!

సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది.

MAA Elections: ‘మా’ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. అక్టోబర్ 10న పోలింగ్!

Maa Elections

MAA Elections: సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ఎన్నికల(MAA Elections) నోటిఫికేషన్‌ విడుదలైంది. మా ఎన్నికలు అక్టోబర్‌ 10వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరగనున్నాయి. ఈమేరకు ఎన్నికల నోటిఫికేషన్‌‌ను జారీ చేశారు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌. ఈ నెల(సెప్టెంబర్) 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు అధికారులు.

సెప్టెంబర్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన తర్వాత.. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల 1వ తేదీ 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉంటుంది. రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తారు. అక్టోబర్‌ 10వ తేదీన ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు.

నియమ నిబంధనలు:
1. ఒక అభ్యర్థి ఒక పోస్ట్‌ కోసం మాత్రమే పోటీ చేయాలి.
2. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత లభించదు.
3. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదు.

మా ఎన్నికల్లో ముఖ్యంగా ఈసారి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు.