Movie Shootings : షూటింగ్స్ తో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్లు.. ఏ షూటింగ్ ఎక్కడో తెలుసా??

  ప్రజెంట్ టాలీవుడ్ లోని పెద్ద, చిన్న హీరోలందరూ తమ లేటెస్ట్ మూవీస్ షూటింగ్స్ కోసం వేరియస్ లొకేషన్స్ లో ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్..........

Movie Shootings : షూటింగ్స్ తో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్లు.. ఏ షూటింగ్ ఎక్కడో తెలుసా??

tollywood movie shootings happening in different places

Movie Shootings :  ప్రజెంట్ టాలీవుడ్ లోని పెద్ద, చిన్న హీరోలందరూ తమ లేటెస్ట్ మూవీస్ షూటింగ్స్ కోసం వేరియస్ లొకేషన్స్ లో ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.

ఇక పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్. ఈ మూవీ షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుపుకుంటోంది. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 28న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

నేచరల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జోడీగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ లవ్ స్టోరీ దసరా. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. వచ్చే ఏడాది మార్చ్ 30న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ బాచుపల్లిలో జరుగుతోంది.

అక్కినేని నాగచైతన్య తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ పోలీస్ గా నటిస్తున్న సినిమా కస్టడీ. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకి డైరెక్టర్. డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.

సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఈ మిస్టిక్ థ్రిల్లర్ షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో జరుగుతోంది.

Dhamaka : మరోసారి రవితేజ డ్యూయల్ రోల్.. ఈ సారన్నా వర్కౌట్ అవుతుందా??

గోపీచంద్, శ్రీవాస్ కాంబో మూవీ షూట్ హైదరాబాద్ లోని డాలర్ హౌస్ లో జరుగుతోంది.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘టిల్లు స్క్వేర్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని చిరాన్ పోర్ట్ లో జరుగుతోంది.

రామ్, బోయపాటి సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.