సంగీత దర్శకుడు శశిప్రీతమ్ కు హార్ట్ ఎటాక్….ఆస్పత్రిలో చికిత్స

  • Published By: murthy ,Published On : June 6, 2020 / 03:32 AM IST
సంగీత దర్శకుడు శశిప్రీతమ్ కు హార్ట్ ఎటాక్….ఆస్పత్రిలో చికిత్స

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశిప్రీతమ్  హార్ట్ ఎటాక్ కు గురయ్యారు.  గురువారం ఉదయం  తీవ్రమైన గుండెనొప్పి రావటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు బంజారా హిల్స్ లోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో  చేర్చించారు. వైద్యులు ఆయనకు స్టంట్స్ వేసి ఆపరేషన్ విజయవంతగా  పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో కోలుకుంటున్నారు.

జేడీ చక్రవర్తి  హీరోగా నటించిన గులాబీ సినిమాకు శశిప్రీతమ్  పాపులర్ సాంగ్స్ అందించారు. సంగీతంతో సంచ‌ల‌నాలు సృష్టించిన శ‌శి ప్రీత‌మ్…గులాబి, సముద్రం, రాఘవ వంటి చిత్రాలకు సంగీతం అందించారు . . సౌండ్ రికార్డింగ్, రిథమ్, ట్యూన్ రికార్డింగ్‌లో ఈయన దిట్ట .

ఇప్పుడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్‌తో పాటు చక్రి, అనూప్ రూబెన్స్‌లు ఈయన దగ్గర పనిచేశారు. టాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలతో పాటు పలు టీవీ సీరియల్స్ కు  సైతం మ్యూజిక్ అందించారు శశి ప్రీతమ్.  ఈయన తెలుగులో చేసినవి చాలా తక్కువే అయినా.. టెక్నికల్‌గా చాలా మందికి మెళుకువలు నేర్పించారు.  

Read: హర్భజన్ సింగ్ తొలి చిత్రం ఫస్ట్ లుక్