Pramod Kumar : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ పబ్లిసిటీ ఇన్చార్జి కన్నుమూత!

తెలుగు సినీ పరిశ్రమలో పబ్లిసిటీ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా, నిర్మాతగా, రచయితగా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ముద్ర వేసుకున్న 'వీరమాచనేని ప్రమోద్ కుమార్'.. 87 ఏళ్ల వయసులో మార్చి 21న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.

Pramod Kumar : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ పబ్లిసిటీ ఇన్చార్జి కన్నుమూత!

Tollywood producer Pramod Kumar passed away

Pramod Kumar : టాలీవుడ్ లో వరుస మరణాలు ప్రతి ఒక్కర్ని బాధిస్తున్నాయి. ఒకరి మరణ వార్త నుంచి కోలుకముందే మరొకరి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. తాజాగా మరో విషాదకర వార్త టాలీవుడ్ ని కలిచి వేస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో పబ్లిసిటీ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా, నిర్మాతగా, రచయితగా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి ‘వీరమాచనేని ప్రమోద్ కుమార్’. ఇక గత కొంత కాలంగా అనారోగ్యం బాధ పడుతున్న ప్రమోద్ కుమార్.. చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. 87 ఏళ్ల ప్రమోద్ కుమార్ మార్చి 21న విజయవాడలో తుదిశ్వాస విడిచారు.

Paul Grant : సినీ పరిశ్రమలో మరో విషాదం.. కుప్పకూలిన ప్రముఖ నటుడు..

కాగా ప్రమోద్ కుమార్ టాలీవుడ్‌లో పబ్లిసిటీ ఇన్చార్జిగా 38 ఏళ్లు పాటు పని చేశారు. దాదాపు 300కి పైగా సినిమాలకు పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేశారు. వీటిలో 50కి పైగా సినిమాలు శతదినోత్సవ వేడుకలు జరుపుకోవడం విశేషం. తన స్నేహితులతో కలిసి రెండు సినిమాలను కూడా నిర్మించారు. వీటిలో ఒకటి మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ‘దొంగ పోలీస్’, ఇంకోటి ‘గరం మసాలా’ అనే చిత్రం. నటుడిగాను పలు సినిమాల్లో నటించారు. అంతేకాదు ప్రమోద్ కుమార్ లో మంచి రచయిత కూడా ఉన్నాడు.

మొదటిగా ‘సుబ్బయ్య గారి మేడ’ అనే ఒక నవలని రాశారు. ఆ తరువాత సినీ రంగంలోని తన అనుభవాలన్నిటిని మేలవించి ‘తెర వెనుక తెలుగు సినిమా’ అనే పుస్తకాన్ని రచించారు. ఇక ఆ పుస్తకానికి గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ప్రమోద్ కుమార్ కి.. శ్రీనివాస్ రాయ్, సరోజ, తులసి రాణి ముగ్గురు పిల్లలు ఉన్నారు.