Tollywood : సెకండాఫ్ సంగతేంటి?? అప్పుడే సగం ఫిక్స్..

టాలీవుడ్ లో ఫస్ట్ 6 మంత్స్ అయిపోయాయి. ఎక్కువ లాభాలు.. కొంచెం నష్టాలతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇక సినిమాల ఆశలన్నీ వచ్చే 6 నెలల మీదే. ఎన్నో ఆశలతో.......................

Tollywood : సెకండాఫ్ సంగతేంటి?? అప్పుడే సగం ఫిక్స్..

Tollywood

Tollywood :  టాలీవుడ్ లో ఫస్ట్ 6 మంత్స్ అయిపోయాయి. ఎక్కువ లాభాలు.. కొంచెం నష్టాలతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇక సినిమాల ఆశలన్నీ వచ్చే 6 నెలల మీదే. ఎన్నో ఆశలతో చిన్న సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాలని పెద్ద సినిమాలు ఈ 6 నెలల్ని టార్గెట్ చేసుకుంటున్నాయి. జులై 1న పక్కా కమర్షియల్ తో మొదలైన సెకండ్ హాఫ్ పాజిటివ్ గానే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

జులై సినిమాలకు పెద్ద సీజన్ కాకపోయినా రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అయిన సినిమాలన్నీ సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ పెట్టేసుకున్నాయి. జులై 8న లావణ్య త్రిపాఠి నటించిన కామెడీ సినిమా ‘హ్యాపీ బర్త్ డే’, జులై 14న రామ్ ‘ది వారియర్’, 15న ‘గుర్తుందా శీతాకాలం’, 22న నాగచైతన్య ‘థాంక్యూ’, ‘కార్తికేయ 2’, 29న అడివి శేష్ ‘హిట్ 2’, రవితేజ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ రిలీజ్ లకు రెడీ అయిపోయాయి.

Pawan kalyan : 30 రోజుల్లో 50 కోట్లు.. పవన్ టార్గెట్ అదేనా?

ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’,ఆగస్టు 11న సమంత ‘యశోద’, ఆగస్టు 12న అఖిల్ ‘ఏజెంట్’, 13న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’, ఆగస్ట్ 25న విజయ్ దేవరకొండ లైగర్ రిలీజ్ అవుతున్నాయి.

జులై, ఆగస్ట్ వరకు సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఇంకా కొన్ని సినిమాలు పక్కా డేట్ మాత్రం ఫిక్స్ చేయకపోయినా సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అల్లరి నరేశ్ ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం, నాగార్జున, ప్రవీణ్ సత్తారు ఘోస్ట్ మూవీ, నాని దసరా మూవీ, చిరంజీవి గాడ్ ఫాదర్, రవితేజ రావణాసుర, బాలయ్య 107వ సినిమా, సమంత విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాలు ఇప్పటికే డేట్స్ అనౌన్స్ చేయకపోయినా సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో మరిన్ని చేరడానికి రెడీగానే ఉన్నాయి. మరి 2022 సెకండ్ హాఫ్ ఏ రేంజ్ లో అదరగొడుతుందో, ఎన్ని కలెక్షన్స్ వస్తాయో చూడాలి.