Senior Heroes: పేరుకే సీనియర్లు.. దూకుడులో కుర్ర హీరోలతో పోటీ!

సుకుమార్ తో సినిమా ప్లాన్ చేస్తున్న చిరంజీవి, సుజిత్ తో మూవీ సైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడితో అదరగొడతానంటున్న బాలయ్య..

Senior Heroes: పేరుకే సీనియర్లు.. దూకుడులో కుర్ర హీరోలతో పోటీ!

Senior Heroes

Senior Heroes: సుకుమార్ తో సినిమా ప్లాన్ చేస్తున్న చిరంజీవి, సుజిత్ తో మూవీ సైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడితో అదరగొడతానంటున్న బాలయ్య.. ఇలా వరస పెట్టి స్టార్ హీరోలు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో లైనప్ సెట్ చేసేసుకున్నారు. అసలు ఒక్కోహీరోకి ఎన్ని సినిమాలున్నాయో, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయో డీటెయిల్డ్ గా చూద్దాం.

Tollywood Cricket : మరోసారి టాలీవుడ్ క్రికెట్.. ఈ సారి అమెరికాలో..

మెగాస్టార్ స్పీడ్ మాత్రం మామూలుగా లేదు. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. కథకి-కథనానికి ఇంపార్టెన్స్ ఇచ్చే మోహన్ రాజాతో గాడ్ ఫాదర్, గ్రాండియర్-యాక్షన్ తో సినిమాలు చేసే మెహర్ రమేష్ తో భోళాశంకర్, సింపుల్ గా మాస్ ఆడియన్స్ కోసం సినిమాలు చేసే బాబీతో, యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమాలు అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. అంతేకాదు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. మొన్నీమధ్య సుకుమార్ తో ఓ యాడ్ కి పనిచేసిన చిరంజీవి, సుకుమార్ తో ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.

Tollywood Celebrations: ఇట్స్ పార్టీ టైమ్.. సెలబ్రేషన్ మూడ్‌లో టాలీవుడ్!

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఫుల్ స్పీడ్ మీదున్నారు. సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న పవర్ స్టార్.. కోవిడ్ తో ప్లాన్ డిజాస్టర్ అయినా.. సినిమాల విషయంలో మాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. ఆల్రెడీ రానాతో కలిసి భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్.. క్రిష్ తో ఫోక్లోర్ కాన్సెప్ట్ లో హరిహర వీరమల్లు సినిమాని స్పీడప్ చేశారు. ఈ సినిమాతో పాటు.. హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ మూవీని లైన్లో పెట్టి.. సముద్రఖని డైరెక్షన్లో రీమేక్ మూవీ ఓకే చేశారు. ఈ రెండు సినిమాలే కాకుండా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో, సురేందర్ రెడ్డితో మరో 2 సినిమాలు లైనప్ చేశారు పవన్ కళ్యాణ్.

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

మరో సీనియర్ హీరో బాలయ్య బాబు అయితే సోలో గానే దూసుకెళుతున్నారు. అఖండకి బాగా టైమ్ తీసుకున్న బాలకృష్ణ.. మలినేని గోపీచంద్ తో నెక్ట్స్ సినిమాని ఆల్రెడీ స్పీడ్ గా చేసేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి తో క్రేజీ ఎంటర్ టైనర్ తో పాటు, పూరీతో మరోసారి తన కాంబినేషన్ ని రిపీట్ చేస్టున్నట్టు అనౌన్స్ చేశారు బాలకృష్ణ.

Tollywood Movies: కుర్ర హీరోలకి కలిసొస్తున్న పెళ్లి కాన్సెప్ట్!

రవితేజ కూడా.. అందరి కంటే ఎక్కువ సినిమాలతో ఎంగేజ్ అయ్యారు. ఆల్రెడీ ఈ సంవత్సరం ఖిలాడి రిలీజ్ చేసిన రవితేజ.. రామారావ్ ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలతో బిజీగా ఉన్నమాస్ మహారాజా బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ లతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావుతోపాటు సుధీర్ వర్మతో రావణాసుర సినిమాలు కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లి ఫుల్ ఎంగేజ్ అయిపోయారు రవితేజ.