CM Jagan: సీఎం జగన్‌‌ను కలిసేందుకు టాలీవుడ్ పెద్దలకు అపాయింట్‌మెంట్ కన్ఫమ్!!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ముందుగానే అంశాలపై చర్చించుకుని ఎట్టకేలకు ఓ ప్రణాళిక రెడీ చేసుకుని..

CM Jagan: సీఎం జగన్‌‌ను కలిసేందుకు టాలీవుడ్ పెద్దలకు అపాయింట్‌మెంట్ కన్ఫమ్!!

Cm Jagan Meeting With Tolywood

CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ముందుగానే అంశాలపై చర్చించుకుని ఎట్టకేలకు ఓ ప్రణాళిక రెడీ చేసుకుని సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తుంటే గుడ్ న్యూస్ వినిపించింది. సెప్టెంబర్ 4న దాదాపు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు మూడు సార్లు ఇప్పటికే ప్రయత్నించినా.. అది కుదరలేదు. ఈ మధ్యే టాలీవుడ్ ప్రముఖులను కలవడానికి జగన్ సుముఖత చూపించారు.

ఇంతలోనే పెళ్లి రోజు సందర్భంగా టూర్‌కు వెళ్ళి వచ్చారు. ఇటీవలే తిరిగొచ్చి వైఎస్పాఆర్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న జనం మధ్యకు రానున్నారు. కడప పర్యటన అనంతరం టాలీవుడ్ పెద్దలను కలవనున్నారట. ఇవన్నీ మరో నాలుగు రోజుల్లో పూర్తయిపోతాయి. సెప్టెంబర్ 4న ఫిక్స్ చేసిన ఈ మీటింగ్ లోఏ విషయాలపై చర్చించాలని ఈ మధ్య చిరంజీవి ఇంట్లో సినిమా పెద్దలంతా చర్చించారు.

ఏ సమస్యలను ఆయన ముందుంచాలి. వాటి పరిష్కారం ఎలా ఉంటే బాగుంటుందనే విషయాలపై కొన్ని రోజుల కింద చిరంజీవి ఇంట్లో నాగార్జున, ఆర్.నారాయణమూర్తి, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏషియన్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ లాంటి వాళ్లు కలిసి మాట్లాడుకున్నారు.

చిరంజీవితో సహా మరో ఇద్దరు ముగ్గురు సినీ పెద్దలకు సీఎం జగన్ నుంచి ఆహ్వానం అందింది. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి.. సమస్యల గురించి సినీ పెద్దలు కూడా ఒక జాబితా రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం 3 షో లకు మాత్రమే అనుమతి ఉండగా.. 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్స్ నడుస్తున్నాయి.

వీటితో పాటు టికెట్ల ధర గురించి కూడా చర్చించడానికి సిద్ధమవుతున్నారు. కొందరు మాత్రమే ప్రతినిధులుగా రావాలని వైఎస్ జగన్ సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.