Tollywood Star Hero’s: అభిమానులపై ప్రేమ కురిపిస్తోన్న హీరోలు!

ఎప్పుడూ హీరోలని ఫ్యాన్స్ ట్రెండ్ చేయడమే కాదు.. అప్పుడప్పుడు అభిమానులపై స్టార్స్ కూడా ప్రేమను చూపిస్తుంటారు. టాలీవుడ్ లో అది చాలాసార్లు రుజువైంది కూడా. కొంతమంది హీరోల సహాయం..

Tollywood Star Hero’s: అభిమానులపై ప్రేమ కురిపిస్తోన్న హీరోలు!

Tollywood Star Hero's

Tollywood Star Hero’s: ఎప్పుడూ హీరోలని ఫ్యాన్స్ ట్రెండ్ చేయడమే కాదు.. అప్పుడప్పుడు అభిమానులపై స్టార్స్ కూడా ప్రేమను చూపిస్తుంటారు. టాలీవుడ్ లో అది చాలాసార్లు రుజువైంది కూడా. కొంతమంది హీరోల సహాయం బయటికి ప్రొజెక్టయితే.. మరికొంతమందిది ప్రతీసారి కనిపించదు. ఏదైమైనా మీకు మేమున్నామంటున్నారు మన హీరోలు. మన స్టార్ హీరోలంటే ఫుల్ క్రేజ్ చూపిస్తుంటారు ఫ్యాన్స్. ఎవరికి వారు వాళ్ల హీరో సక్సెస్ కోసం విపరీతంగా కష్టపడుతుంటారు. అయితే అప్పుడప్పుడు తిరిగి ఫ్యాన్స్ కోసం కూడా కొన్ని క్రేజీ పనులు చేస్తుంటారు హీరోలు.

Simbu: వేదికపై కన్నీరు పెట్టుకున్న శింబు.. ఇబ్బంది పెడుతున్నదెవరు?

ఈమధ్యే డిఫరెంట్ గా తన అభిమానాన్ని చాటుకున్నాడు ప్రభాస్‌ఫ్యాన్. తలపై ప్రభాస్‌ అని అక్షరాలు కనిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అతని అభిమానాన్ని చూసి షాక్‌ అయిన ప్రభాస్‌ సరదాగా కాసేపు మాట్లాడి ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రభాస్ కి ఇలాంటివి కొత్తేమీ కాదు. అభిమానులపై ఫస్ట్ నుంచి ఇలా ప్రేమను చూపించడం రెబల్ స్టార్ కి అలవాటే. కొన్ని కనిపిస్తాయి.. మరికొన్ని కనిపించవంటుంటారు. అందుకే డార్లింగ్ అంటే ఇంత అభిమానాన్ని చూపిస్తారు వాళ్లు.

Aha-Netflix: ఓటీటీలో వచ్చేసిన మరో రెండు సినిమాలు..!

బాలకృష్ణ సైతం అంతే. తన బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎన్నో రకాలుగా సహాయాన్ని అందించారు. డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా బాలయ్య తన అభిమానులపై ప్రేమను చాటిన మ్యాజికల్ మూమెంట్స్ ను ఎప్పటికీ తలచుకుంటారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి హీరోగానే కాదు సేవా దృక్ప‌థం ఉన్న వ్య‌క్తిగా అంద‌రి మ‌న‌సులను ఎప్పుడో గెలుచుకున్నారు. మొదటి నుంచి ఫ్యాన్స్ కి ఏదైనా చేయాలని తాపత్రయపడే చిరూ క‌రోనా స‌మ‌యంలోనూ ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అభిమానుల‌కి అవసరమైన ఎన్నో సంద‌ర్భాల‌లో నేనున్నానన్నారు. పవన్ కూడా ఎన్నో రకాలుగా అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు.

RRR: ఆర్ఆర్ఆర్@4 ఏళ్ళు.. ఇన్ని రోజులు ఏం చేశారు?

ఒకరూ, ఇద్దరూ అని కాదు ఫ్యాన్స్ ని సరదాగా సర్ ప్రైజ్ చేయడం, అవసరైనప్పుడు భరోసాగా ఉండటం.. చాలామంది హీరోలే చేస్తున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్న అభిమానులను పలకరించడం దగ్గరి నుంచి.. కొంతమంది ఫ్యాన్స్ చివరి కోరిక తీర్చే వరకు కూడా యంగ్ హీరోలు ముందుంటున్నారు. తారక్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు ఎన్నోసార్లు ఇలా ముందుకొచ్చిన వాళ్లే.