Tollywood Mega Meeting: సీఎంతో స్టార్స్ భేటీ.. మోహన్ బాబు ఎందుకు మిస్సయ్యారు?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలలో మొదటిది ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు.. థియేటర్ల మీద అధికారుల దాడులు. ఈ సమస్యకు పరిష్కారం..

Tollywood Mega Meeting: సీఎంతో స్టార్స్ భేటీ.. మోహన్ బాబు ఎందుకు మిస్సయ్యారు?

Tollywood Mega Meeting

Tollywood Mega Meeting: కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలలో మొదటిది ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు.. థియేటర్ల మీద అధికారుల దాడులు. ఈ సమస్యకు పరిష్కారం కోసం సినిమా పెద్దలు కొందరు ఎన్నోసార్లు ప్రయత్నించగా.. ఏపీ ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేసింది. జనవరిలో ఒకసారి సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి ఈరోజు మరోసారి సీఎంతో భేటీ అయి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

CM Jagan-Chiru : సినిమా టికెట్ రేట్లు, థియేటర్లలో షోలపై కమిటీ కీలక ప్రతిపాదనలు

చిరంజీవితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక దిగ్గజం రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, ఆర్ నారాయణ మూర్తి, అలీ, పోసాని కృష్ణ మురళి తదితరులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి సీఎంఓ నుంచి అందరికీ ఆహ్వానాలు అందగా వారే ఈ భేటీలో పాల్గొన్నట్లు గత రెండు రోజులుగా మీడియా సమావేశాలను బట్టి తెలుస్తుంది. సీఎంఓ నుండి ఆహ్వానాలు అందిన వారిలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

Ram Charan: ముంబై వీధుల్లో రామ్ చరణ్.. ఎందుకు వెళ్లినట్లో?

ఇంతమంది స్టార్స్, ఇండస్ట్రీకి ప్రధాన సమస్యపై ఒక రాష్ట్ర సీఎంతో చర్చలు జరుగుతుండగా.. సీనియర్లకు సీనియర్ హీరో, అందునా సీఎం జగన్మోహన్ రెడ్డితో బంధుత్వం ఉన్న మోహన్ బాబు, ఆయన కుటుంబం నుండి ఎవరూ హాజరుకాలేదు. మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా.. విష్ణు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. దీనికి కారణం ఏంటన్న దానిపై సోషల్ మీడియా నుండి ఇండస్ట్రీ వరకు చర్చలు జరగడం సహజం.

CM Jagan : సినీ పరిశ్రమ విశాఖకు కూడా రావాలి.. జూబ్లిహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దాం : సీఎం జగన్

ఈరోజు భేటీకి వెళ్లిన వారంతా సీఎంఓ నుండి అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళేనని చెప్పారు. మరి మోహన్ బాబుకు ఆహ్వానం అందలేదా? ఒకవేళ అందినా మోహన్ బాబు కావాలనే ఈ భేటీకి వెళ్లలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. సీనియర్ నటులుగా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలకు సీఎంఓ ఆహ్వానాలు పంపాలని అనుకుంది. అయితే, వయసు రీత్యా కృష్ణ, కృష్ణంరాజులతో భేటీ కష్టం కావడం, ఇతరత్రా కారణాలతో నాగార్జున, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ లను ఆహ్వానించి అన్ని కుటుంబాలను కవర్ చేశారు.

Son Of India Trailer: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే..!

మరి ఇంతమందిని ఆహ్వానించినపుడు మోహన్ బాబు, విష్ణులను కూడా ఆహ్వానించడం గ్యారంటీ. ఆహ్వానించిన వారిలో అమలకి కరోనా సోకడంతో నాగార్జున దూరమయ్యారు. ఎన్టీఆర్ ఎందుకు భేటీకి వెళ్లలేదో ఎక్కడా స్పష్టత లేదు. ఇక చిరంజీవి లీడ్ తీసుకోవడం కారణంగానే మోహన్ బాబు దూరంగా ఉన్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తుంది. చిరంజీవి సీఎంతో భేటీ గురించి రెండు రోజుల క్రితమే విష్ణు అది ఆయన వ్యక్తిగత విషయమని మాట్లాడారు. ఈరోజు హీరోలు, దర్శకులు, నటులు కూడా వెళ్లిన ఈ మీటింగ్ మీద మోహన్ బాబు, విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.