Stars Workout : కండల వెనుక కష్టం..

ఇప్పటికీ చాలామంది యూత్ చిరంజీవిలా వర్కౌట్స్ చేయలేరనే ట్రెండీ కామెంట్ చేశారు ఫిట్‌నెస్ ట్రైనర్ కులదీప్ సేథీ..

Stars Workout : కండల వెనుక కష్టం..

Stars Workout

Stars Workout: వాళ్లు టాలీవుడ్ బిగ్ స్టార్స్ అయినా.. స్టూడెంట్స్‌లా కసరత్తులు చేస్తున్నారు. ఒక సీనియర్ స్టార్ హీరో యూత్‌కి ఇన్సిపిరేషన్‌గా నిలుస్తుంటే.. మరొకరు సరిగ్గా తినకుండానే కష్ట పడుతున్నారు. ఇంకో హీరోయిన్ ఉంది.. బలవంతంగా గెంటేస్తే కానీ పనులు ఆపదు.. ఇలా డిఫరెంట్ యాటిట్యూడ్స్‌తో టాలీవుడ్ బిగ్ స్టార్స్ ఫిట్‌నెస్ కోసం ఏం చేస్తున్నారో ఇప్పుడు చూడండి..

MAA Building : మోహన్ బాబుకి నాగబాబు కౌంటర్..

ఇప్పటికీ చాలామంది యూత్ చిరంజీవిలా వర్కౌట్స్ చేయలేరనే ట్రెండీ కామెంట్ చేశారు ఫిట్‌నెస్ ట్రైనర్ కులదీప్ సేథీ. సెలెబ్రిటీ ఫిట్‌నెస్ గురువుగా పేరున్న కులదీప్.. డూప్స్ లేకుండా చిరు చేసే యాక్షన్ సీన్స్.. దాంతో ఫిజికల్‌గా ఆయన తరచూ పడే ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. అయితే వన్స్ స్టార్ట్ కెమెరా అనగానే కష్టం మొత్తం మర్చిపోతారని.. యంగ్ జనరేషన్‌కి మెగాస్టార్ ఓ రోల్ మోడల్ అని కామెంట్ చేశాడు.

Sonu Sood : దుర్గమ్మ సన్నిధిలో సోనూ సూద్..

తండ్రిలాగే ఫిట్‌నెస్‌కి బాగా ఇంపార్టెంట్స్ ఇస్తారు రామ్ చరణ్. ‘చిరుత’ నుంచే చెర్రీ మేకోవర్ స్టార్ట్ అయినా.. అది పీక్‌కి చేరింది మాత్రం ‘మగధీర’ తోనే. సినిమా సినిమాకు వేరియేషన్ చూపించడం కోసం జిమ్‌లో కష్టపడుతుంటారు చరణ్. అలా ‘ధృవ’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో సూపర్ ఫిట్‌గా కనిపించిన మెగా పవర్ స్టార్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఓ రేంజ్‌లో వర్కౌట్స్ చేశారు.

Ranveer Singh : ఏయ్.. నువ్వు నా హెయిర్ స్టైల్ కాపీ కొట్టావ్..!

‘ఇస్మార్ట్ శంకర్’ తో హాట్ మంక్‌గా పేరు తెచ్చుకున్న రామ్.. ఎప్పుడూ ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. ప్రస్తుతం ‘లైగర్’ లో బాక్సర్‌గా కనిపించేందుకు జిమ్ కష్టాలు పడుతున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఎన్ని వర్కౌట్స్ చేసినా సైలెంట్‌గా చేయడం రౌడీ బాయ్ స్పెషాలిటీ. అయితే ఈ హీరోకి తిండి మీద ఫోకస్ తక్కువ. అలాగే స్టార్ అనిపించుకుంటున్నా.. ఫిట్‌నెస్ ట్రైనర్స్ దగ్గరి నుంచి స్పెషల్ ట్రీట్ మెంట్ కోరుకోడనే పేరుంది విజయ్‌కి.

Anantha Sriram: రచయిత అనంత శ్రీరామ్‌పై కేసు నమోదు

ఎన్టీఆర్ కూడా ఫిట్ మంత్రాను రెగ్యులర్‌గా ఫాలో అవుతారు. ప్రభాస్, రానా సంగతి సరేసరి. ఇక అక్కినేని ఫ్యామిలీ మొదటి నుంచి ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యతనిస్తుంది. కల్యాణ్ రామ్ కూడా వర్కౌట్స్ పూర్తి ట్రాన్స్‌ఫర్మేషన్ చూపించారు. ఇక కార్తీకేయకు బెస్ట్ ఫిజిక్ అనే పేరుంది టాలీవుడ్‌లో. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఎప్పటికప్పుడు నయా వర్కౌట్స్‌‌తో బాడీకి పని చెప్తూనే ఉంటారు. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే.. రాశీ ఖన్నాకి త్వరగా వర్కౌట్స్ బోర్ కొట్టేస్తాయట. ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. రష్మిక ఇక చాలంటున్నా మొండిగా జిమ్‌లోనే ఉంటుందట. సమంతా, లావణ్య త్రిపాఠి, రెజీనా లాంటి వాళ్లకి కూడా రెగ్యులర్ వర్కౌట్స్ ఉండాల్సిందే.