Pooja Hegde: టాలీవుడ్ టూ బాలీవుడ్.. కెరీర్ బెస్ట్ టైమ్ ఎంజాయ్ చేస్తోన్న బుట్టబొమ్మ!

పూజా హెగ్డే ఏ ముహూర్తాన టాలీవుడ్ లో హిట్ కొట్టిందో కానీ.. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. కెరీర్ స్టార్ట్ చేసిన షాట్ టైమ్ లో సౌత్..

Pooja Hegde: టాలీవుడ్ టూ బాలీవుడ్.. కెరీర్ బెస్ట్ టైమ్ ఎంజాయ్ చేస్తోన్న బుట్టబొమ్మ!

Pooja Hegde

Pooja Hegde: పూజా హెగ్డే ఏ ముహూర్తాన టాలీవుడ్ లో హిట్ కొట్టిందో కానీ.. ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. కెరీర్ స్టార్ట్ చేసిన షాట్ టైమ్ లో సౌత్ స్టార్ హీరోలతో యాక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంటున్న పూజాహెగ్డే.. బాలీవుడ్ లో మరో స్టార్ హీరో సినిమాని స్టార్ట్ చెయ్యబోతోంది.

Movie Promotions: సినిమా సంగతేమో కానీ.. ప్రమోషన్ల కోసం కష్టపడుతున్న స్టార్లు!

ప్రజెంట్ ఏ హీరోయిన్ కీ లేనన్ని సినిమాలతో ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా రికార్డ్ క్రియేట్ చేస్తోంది పూజాహెగ్డే. హీరో ఎవరైనా.. హీరోయిన్ గా పూజానే కనిపిస్తోంది. స్టార్టింగ్ లో కాస్త కష్టపడ్డ పూజా.. ఇప్పుడు కనీసం బ్రేక్ తీసుకోడానికి కూడా వీలులేకుండా స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో అనౌన్స్ చేసిన కభీ ఈద్ కభీ దివాళి సినిమా షూటింగ్ ని ఈ నెలలో స్టార్ట్ చేసుకోబోతోంది. పూజాహెగ్డే.

Sarkaru Vaari Paata: కీర్తి భుజంపై వాలిన మహేష్.. పోస్టర్ అదిరిందంతే!

2020లో ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ చేసి 2021 ఈద్ కి రిలీజ్ అన్నారు. కానీ కోవిడ్ తో అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. లేటెస్ట్ గా 2023 ఈద్ కి రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది ఈ సినిమా. సల్మాన్ ఖాన్ తో ఫస్ట్ టైమ్ నటించబోతున్న పూజాహెగ్డే.. కభీ ఈద్ కభీ దివాళి షూట్ ని ఈనెలలోనే స్టార్ట్ చేస్తోంది. ఈ సినిమాతో పాటు రణ్ వీర్ సింగ్ తో సర్కస్ అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ కూడా కమిట్ అయ్యింది.

AAGMC: కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే.. ఫీల్ సాంగ్ రిలీజ్!

ప్రజెంట్ పూజా అకౌంట్ లో ఉన్న వన్నీ స్టార్ హీరోల సినిమాలే. తెలుగు నుంచి బాలీవుడ్ వరకూ పూజాకి ఛాన్స్ ఇస్తున్న వాళ్లందరూ స్టార్ హీరోలే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో చేస్తూ.. తమిళ్ లో బీస్ట్ లో విజయ్ కి జంటగా నటిస్తూ.. మరో వైపు మహేష్ బాబుతో రెండోసారి యాక్ట్ చేస్తోంది పూజా. వీటితో పాటు పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో కూడా ఆఫర్ కొట్టేసింది.

Pooja Hegde: ఐదు సినిమాలు రిలీజ్.. ఈ ఇయర్ తనదే అంటున్న బుట్టబొమ్మ!

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో.. మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ లాంటి టాప్ హీరోలందరితో బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలు చేసేస్తోంది. ఒక పక్క తెలుగు సినిమాలతో పాటు తమిళ్, హిందీ సినిమాలతో కెరీర్ బెస్ట్ టైమ్ ని ఎంజాయ్ చేస్తోంది.