Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్! Tollywood to Bollywood Stars Imports and Exports!

Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్!

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. టీటౌన్ టు బీటౌన్ - బీటౌన్ టు టీటౌన్ జర్నీ కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ రేంజ్ పెరిగాక బాలీవుడ్ యాక్టర్స్ ఇక్కడి సినిమాల్లో నటించడం చూస్తూనే ఉన్నాం.

Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్!

Tollywood-Bollywood: అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. టీటౌన్ టు బీటౌన్ – బీటౌన్ టు టీటౌన్ జర్నీ కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ రేంజ్ పెరిగాక బాలీవుడ్ యాక్టర్స్ ఇక్కడి సినిమాల్లో నటించడం చూస్తూనే ఉన్నాం. అయితే తెలుగు స్టార్స్ సైతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం క్యూ కడుతున్నారు. స్పెషల్ రిక్వెస్ట్ చేస్తే చాలు తెలుగు యాక్టర్స్ కొందరు హిందీలో మెరిసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Bollywood : రంజాన్ వీకెండ్ కూడా బాలీవుడ్ కి కలిసి రాలేదు.. బోల్తా పడ్డ భారీ సినిమాలు..

నేషనల్ సినిమా స్థాయికి టాలీవుడ్ ఎదిగాక ఇక్కడి సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ స్టార్స్ పెద్దగా ఆలోచింటట్లేదు. ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 లాంటి ప్రాజెక్టులో అజయ్ దేవగణ్, ఆలియా, సంజయ్ గత్ లాంటి వాళ్లని చూసాం. ఇక మెగాస్టార్ చిరంజీవి కోసం నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. గాడ్ ఫాదర్ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మాత్రమే కాదు ఓ సాంగ్ లో చిరూతో కలిసి సల్మాన్ స్టెప్పులేస్తున్నాడు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె లో బిగ్ బి అమితాబ్, దీపికా పదుకొణే లాంటి సూపర్ స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. ఇంకా కొందరు కొన్ని సినిమాలకు సైన్ చేసారు.. టాలీవుడ్ లో నటించాలనుందని పబ్లిక్ గానే చెప్పేసారు.

Bollywood Remakes: రీమేక్ మాయలో బాలీవుడ్.. సౌత్ కంటెంట్ కావాలంటున్న స్టార్స్!

టాలీవుడ్ స్టార్స్ సైతం స్పెషల్ రిక్వెస్ట్ మేరకు బాలీవుడ్ సినిమాలు సైన్ చేస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కోసం వెంకీ ఓ బాలీవుడ్ ప్రపోజల్ కు ఎస్ చెప్పారు. పూజా హెగ్డే కాంబినేషన్ లో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళి సినిమాను ఫర్హద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. సల్మాన్ బావ ఆయుష్ శర్మ కీరోల్ చేస్తోన్న ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ ఫుల్ లెంత్ రోల్ చేసేందుకు ఒప్పుకున్నారు. ఎప్పటినుంచో వెంకీతో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తోన్న సల్మాన్.. ఆయన్ని స్వయంగా రిక్వెస్ట్ చేశాడు. దీంతో చంటి రీమేక్ అనారి, యమలీల రీమేక్ తక్దీర్ వాలా సినిమాల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు డైరెక్ట్ బాలీవుడ్ మూవీలో వెంకటేశ్ కనిపించబోతున్నారు. ఇక ఇందులోనే విలన్ గా జగపతిబాబు పేరు వినిపిస్తుండగా దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.

Bollywood Remakes: బాలీవుడ్ డిజాస్టర్ రీమేక్స్.. సౌత్ రీమేక్స్‌కి దక్కని ఆదరణ!

అక్కినేని హీరోలు కూడా బాలీవుడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో మెరుస్తుంటారు నాగార్జున. అయితే ఈసారి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్రతో బాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు వెళ్తున్నారు. రణ్ బీర్, ఆలియా, అమితాబ్ వంటి నార్త్ స్టార్స్ నటిస్తోన్న ఈమూవీలో నాగ్ సైతం ప్రామినెంట్ రోల్ చేసారని చెప్తున్నారు. మూడు భాగాలుగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర.. ఈ ఏడాది సెప్టెంబర్ 9న పార్ట్ 1 శివను చూపించబోతుంది.

Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?

నాగ్ కన్నా ముందే 2022లో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతున్నాడు నాగచైతన్య. ఆమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఆమీర్ కోరిక మేరకు లాల్ సింగ్ చద్దాలో చైతూ స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. పీరియాడికల్ ఫిల్మ్ గా రాబోతున్న లాల్ సింగ్ చద్దాలో చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా నటించాడు. అద్వైత్ చందన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ సమయంలో ఏర్పడిన బాండింగ్ తోనే లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు మిస్టర్ పర్ఫెక్ట్ హాజరయ్యాడు.

Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!

ఈ ఏడాది అక్టోబర్ 25న రిలీజ్ కానున్న సినిమా రామ్ సేతు. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేస్తోన్న ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కి ఫుల్ లెంత్ క్యారెక్టర్ దక్కింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా అక్షయ్, జాక్వెలిన్ తో పాటూ సత్యదేవ్ కనిపించాడు. సో ఆదిపురుష్ తో ప్రభాస్, లైగర్ తో విజయ్ దేవరకొండ లాంటి హీరోలు డైరెక్ట్ డెబ్యూ చేస్తోంటే… ఇలా కొందరు టాలీవుడ్ యాక్టర్స్ మాత్రం బాలీవుడ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వాళ్ల పాన్ ఇండియా ప్లాన్స్ కు హెల్ప్ అవుతున్నారు.

×