Tollywood Young Hero's: వరస సినిమాలు లైన్లో పెట్టేస్తున్న స్టార్స్! Tollywood Young Hero's lining up and speedup movies!

Tollywood Young Hero’s: వరస సినిమాలు లైన్లో పెట్టేస్తున్న స్టార్స్!

చిరూ, ప్రభాస్, చరణ్, రవితేజ ఐదారు సినిమాలతో జోరుమీదుంటే మూడు, నాలుగు సినిమాలతో రచ్చ చేస్తోన్న బ్యాచ్ వేరే ఉంది. కొవిడ్ తో పొగొట్టుకున్నది రాబట్టుకోవడమే కాదు.. ఇదే టైమ్ లో పెరిగిన..

Tollywood Young Hero’s: వరస సినిమాలు లైన్లో పెట్టేస్తున్న స్టార్స్!

Tollywood Young Hero’s: చిరూ, ప్రభాస్, చరణ్, రవితేజ ఐదారు సినిమాలతో జోరుమీదుంటే మూడు, నాలుగు సినిమాలతో రచ్చ చేస్తోన్న బ్యాచ్ వేరే ఉంది. కొవిడ్ తో పొగొట్టుకున్నది రాబట్టుకోవడమే కాదు.. ఇదే టైమ్ లో పెరిగిన టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్ ను వాడేసుకోవాలని గట్టిగా డిసైడయ్యారు. అందుకే 2022లో తగ్గేదే లే అంటూ వరుస షూటింగ్స్ తో రప్ఫాడించేస్తున్నారు.

2022 Tollywood Films: సినిమా కళ్లన్నీ ఈ ఏడాది మీదే.. దేశమంతా టాలీవుడ్ గురించే!

ట్రిపుల్ ఆర్ తో ఫ్యాన్స్ కు కిక్కిచ్చిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలోనే ఎన్టీఆర్ – కొరటాల సినిమా సెట్స్ పైకెళ్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొరటాల ప్రాజెక్ట్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేస్తారు తారక్. నెక్ట్స్ ఉప్పెన బుచ్చిబాబు, సంజయ్ లీలా భన్సాలీ వంటి పేర్లు తారక్ తో కలిపి వినిపిస్తున్నాయి. వీళ్లే కావొచ్చు.. మరెవరైనా కావొచ్చు.. ఏ డైరెక్టర్స్ నైనా 2022లో తారక్ అఫీషియల్ చేస్తారు.

Mohan Babu: నా మౌనం చేతగానితనం కాదు.. సినిమా టికెట్ల వివాదంపై తొలిసారి మోహన్ బాబు!

అతిత్వరలో త్రివికమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నారు సూపర్ స్టార్. ఏప్రిల్ 1కి రిలీజ్ డేట్ మార్చుకున్న సర్కారు వారి పాటకు సంబంధించి ఇంకొక షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా పూర్తైతే.. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా.. త్రివిక్రమ్ తో సెట్స్ పైకెళ్లడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ మూవీ తర్వాత రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యేది కూడా ఇదే సంవత్సరంలో. ప్యాన్ వరల్డ్ లెవెల్ లో మహేశ్ – రాజమౌళి సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.

Sankranthi Releases: పెద్ద పండక్కి మేమున్నామంటున్న చిన్న సినిమాలు!

భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు తర్వాత హరీశ్ శంకర్ సినిమాను స్టార్ట్ చేస్తారు పవర్ స్టార్. నాని అంటే సుందరానికి ఫైనల్ స్టేజ్ లో ఉంది. జనవరిలోనే దసరా మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ రెండు సినిమాల రిలీజ్ లతో పాటూ నాని కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ మెంట్ 2022లో ఉండబోతుంది. రానా విరాటపర్వంకి ఎప్పుడు మోక్షం వస్తుందో చూడాలి.

Ramgopal Varma: ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఆర్జీవీ

బంగార్రాజు, లాల్ సింగ్ చద్దా, థ్యాంక్యూ సినిమాలతో పాటూ నెట్ ఫ్లిక్స్ హారర్ వెబ్ సిరీస్.. చైతూ 2022 రిలీజ్ లిస్ట్ లో ఉన్నాయి. ఆ తర్వాత విజయ్ కనకమేడల, నందినిరెడ్డి,, చైతూ లైనప్ లో ఉన్నారని తెలుస్తోంది. అఖిల్ ఏజెంట్ సినిమా ఈ ఇయర్ సెకండ్ క్వార్టర్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఫలనా అమ్మాయి ఫలనా అబ్బాయి, పోలీస్ వారి హెచ్చరిక, నారీ నారీ నడు మురారితో పాటూ మరో సినిమా కూడా 2022లో చూపించబోతున్నాడు నాగశౌర్య.

×