Mission Impossible : డూప్ లేకుండా రెండువేల అడుగుల ఎత్తులో స్టంట్ చేసిన హాలీవుడ్ హీరో

ఈ సీక్వెల్ లో వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ 8’ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా కోసం టామ్ క్రూయిజ్ ఓ అసాధ్యమైన ఫీట్ చేశాడు. రెండు వేల అడుగుల ఎత్తులో............

Mission Impossible :  డూప్ లేకుండా రెండువేల అడుగుల ఎత్తులో స్టంట్ చేసిన హాలీవుడ్ హీరో

Tom

Mission Impossible :  హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ తన హిట్ సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ కి సీక్వెల్స్ తీసుకుంటూ వెళ్తున్నారు. ఈ ‘మిషన్ ఇంపాజిబుల్’ సీక్వెల్స్ అన్ని భారీ విజయాన్ని కూడా సాధిస్తున్నాయి. ఈ సినిమాల్లో రిస్కీ స్టంట్ లు చాలానే ఉంటాయి. అయితే వీటిని చాలా వరకు టామ్ క్రూయిజ్ స్వయంగా చేస్తాడు. కొన్ని సీన్స్ లో మాత్రం డూప్ లు చేస్తారు. మాములుగా చాలా సినిమాలో రిస్కీ షాట్లు డూపులే చేస్తారు. కానీ టామ్ క్రూయిజ్ సొంతంగా తానే చేస్తాడు.

Shahid Kapoor : ‘జెర్సీ’ షూటింగ్‌లో ప్రమాదం.. 25 కుట్లు పడ్డాయి: షాహిద్‌కపూర్

ఈ సీక్వెల్ లో వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ 8’ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా కోసం టామ్ క్రూయిజ్ ఓ అసాధ్యమైన ఫీట్ చేశాడు. రెండు వేల అడుగుల ఎత్తులో ప్రైవేట్ విమానం ఎగురుతుండగా దాని కాక్‌పిట్‌లో నుంచి బయటకు వచ్చి విమానం రెక్కపై కూర్చున్నాడు టామ్. ఆ తర్వాత విమానం రెక్కని పట్టుకొని తలకిందులుగా వేలాడాడు. ఆ సమయంలో పైలట్‌ ఆ విమానాన్ని పల్టీ కొట్టించాడు. దీంతో టామ్ క్రూయిజ్ తలకిందులైన విమానం రెక్కపై కూర్చున్నట్లు కనిపిస్తోంది. పక్కన మరో విమానంలో నుంచి ఇదంతా షూట్ చేస్తున్నారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ విజేతకు అదిరిపోయే ఆఫర్.. ప్రైజ్‌మనీ‌తో పాటు ఇల్లు కట్టుకోడానికి స్థలం కూడా..

ఇలా డూప్ లేకుండా ఇంత రిస్కీ షాట్లు తీయడం టామ్ కి కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి రిస్కులు ఎన్నో చేశాడు. ప్రస్తుతం ఈ స్టంట్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. టామ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు ప్రేక్షకులు.