Top Gun Maverick : అక్షరాలా వంద కోట్ల డాలర్లు.. నెల రోజుల్లో సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన టామ్ క్రూజ్..

టామ్ క్రూజ్ నటించిన 'టాప్ గ‌న్ మావ‌రిక్' సినిమా మే 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఎప్పటిలాగే టామ్ క్రూజ్ తన యాక్షన్ తో ప్రేక్షకులని మెప్పించడంతో సినిమాకి కలెక్షన్ల వర్షం...............

Top Gun Maverick : అక్షరాలా వంద కోట్ల డాలర్లు.. నెల రోజుల్లో సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన టామ్ క్రూజ్..

Top Gun Maveric

Tom Cruise :  మన ఇండియన్ సినిమాలు 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు సాధిస్తేనే గర్వంగా చెప్పుకుంటాం. ఇక హాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ గురించి తెలిసిందే. వాటికి ఉన్న విస్తృతమైన మార్కెట్ వల్ల 1000 కోట్ల కలెక్షన్స్ ఈజీగా వస్తాయి. అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ కూడా వస్తాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ న‌టించిన ‘టాప్ గ‌న్ మావ‌రిక్’ సినిమా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది.

టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గ‌న్ మావ‌రిక్’ సినిమా మే 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఎప్పటిలాగే టామ్ క్రూజ్ తన యాక్షన్ తో ప్రేక్షకులని మెప్పించడంతో సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా వంద కోట్ల డాల‌ర్లు వ‌సూల్ చేసింది. కేవ‌లం 31 రోజుల్లోనే 100 కోట్ల డాలర్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును టాప్ గ‌న్ క్రియేర్ట్ చేసింది. గతంలో కొన్ని హాలీవుడ్ సినిమాలు 100 కోట్ల డాలర్లకి కలెక్ట్ చేసినా ఇంత త్వరగా ఆ ఫీట్ ని అందుకోలేదు.

Prabhas : ప్రాజెక్ట్ K కోసం తరలి వచ్చిన స్టార్లు.. ట్రెండ్ అవుతున్న ఫొటో..

100 కోట్ల డాలర్లు అంటే అక్షరాలా మన ఇండియన్ కరెన్సీలో 7800 కోట్ల రూపాయలకు పైనే. ‘టాప్ గ‌న్ మావ‌రిక్’ సినిమా అమెరికా మార్కెట్‌లో 520 మిలియ‌న్ల డాల‌ర్లకి పైగా కలెక్ట్ చేయగా, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో 480 మిలియ‌న్ల డాల‌ర్లకు పైగా వ‌సూలు చేసింది. ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.