Ram Pothineni : హీరో రామ్ ఇంట్లో తీవ్ర విషాదం, నా హృదయం ముక్కలైందని ఆవేదన

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే ఇండస్ట్రీ చాలా మంది ప్రముఖులను కోల్పోయింది. మరికొందరు సినీ ప్రముఖుల కుటుంబసభ్యులు అనారోగ్యంతో చనిపోతున్నారు. తాజాగా హీరో రామ్ పోతినేని ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

Ram Pothineni : హీరో రామ్ ఇంట్లో తీవ్ర విషాదం, నా హృదయం ముక్కలైందని ఆవేదన

Ram Pothineni

Ram Pothineni : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే ఇండస్ట్రీ చాలా మంది ప్రముఖులను కోల్పోయింది. మరికొందరు సినీ ప్రముఖుల కుటుంబసభ్యులు అనారోగ్యంతో చనిపోతున్నారు. తాజాగా హీరో రామ్ పోతినేని ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

రామ్ తాతయ్య ఈరోజు(మే 18,2021) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా రామ్ తన తాత గురించి భావోద్వేగ ట్వీట్ చేశాడు. విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన గొప్ప వ్యక్తిగా ఎలా ఎదిగారో రామ్ తన ట్వీట్‌లో వివరించాడు.

విజయవాడలో ఒక లారీ డ్రైవర్ గా తన తాతయ్య జీవితం ప్రారంభమైందని రామ్ చెప్పాడు. డ్రైవర్ స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నాడు. కుటుంబానికి అన్ని వసతులు, సౌకర్యాలను అందించేందుకు ఆ రోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవారని గుర్తు చేసుకున్నాడు.

డబ్బులు ఉన్న ప్రతి వ్యక్తి ధనవంతుడు కాలేడని… మంచి మనసుతోనే ధనవంతులు అవుతారనే విషయాన్ని మాకు నేర్పించారని చెప్పాడు. మీ పిల్లలందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి మీరే కారణమని తెలిపాడు. మీ మరణం కలచి వేస్తోందని, నా హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తాతయ్య ఆత్మకు శాంతి చేకూరాలని రామ్ ప్రార్థించాడు.