Radhe Shyam: పూజ పాత్రకి విషాదాంతం.. అప్డేట్స్ ఏం చెప్తున్నాయ్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత మళ్ళీ తనలోని రొమాంటిక్ యాంగిల్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. దీంతో రాధేశ్యామ్ ఎప్పుడొస్తుందా అని రెబల్ స్టార్ అభిమానులు ఎంతగానో..

Radhe Shyam: పూజ పాత్రకి విషాదాంతం.. అప్డేట్స్ ఏం చెప్తున్నాయ్?

Radhe Shyam

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత మళ్ళీ తనలోని రొమాంటిక్ యాంగిల్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. దీంతో రాధేశ్యామ్ ఎప్పుడొస్తుందా అని రెబల్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ భారీ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి మేకర్స్ ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేస్తూ ఇంకా ఇంకా సినిమా మీద హైప్స్ పెంచే పనిలో ఉన్నారు.

Ajith Kumar: నయా ట్రెండ్.. తోకలొద్దు.. నా పేరే నాకు ముద్దు!

అయితే.. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, రెండు పాటలను చూసిన ప్రేక్షకులు ఒక్కొకటి ఒక్కోలా ఈ లవ్ స్టోరీ ఇలా ఉండబోతుందని.. ఒక్కో పాత్ర ఇలా ఉండబోతుందని ప్రిడిక్షన్లు కూడా మొదలు పెట్టారు. టీజర్ వచ్చిన కొత్తలోనే ప్రభాస్ పాత్ర రివీల్ చేసిన మేకర్స్ అంతర్లీనంగా కథను కూడా చెప్పేశారు. ప్రభాస్ చేతి రేఖలు చూసి జాతకాలు చెప్పడం వృత్తి కాగా.. పూజ పాత్ర పేరు ప్రేరణ అని కూడా రివీల్ చేశారు. ఇక, ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన పాటతో మరికొంత కథను అంతర్లీనంగా చెప్పారు.

Salman Khan: సల్లూ భాయ్‌ని వాడేసుకుంటున్న తెలుగు హీరోలు!

ఈ సినిమాలో ప్రేరణ పూజా హెగ్డే పోషించిన క్యూట్ పాత్రను విషాదాంతంగా ముగించనున్నట్లుగా అర్ధమవుతుంది. ఎంతో ఫేమస్ పామిస్ట్ అయ్యిన విక్రమాదిత్య ఆమె చనిపోయాక ఆమె జ్ఞాపకాల్లో ఉంటాడేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ను బట్టి చూస్తే ఫేమస్ పామిస్ట్ అయ్యిన విక్రమాదిత్య ప్రేరణ మరణం అనంతరం ఆమె జ్ఞాపకాల్లోనే గడపడం.. ఆ తర్వాత కథ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది. ఇదంతా అప్డేట్స్ ను చూసి అంచనాలు మాత్రమే కాగా అసలు సినిమాలో ఏ పాత్ర ఎలా ఉండబోతుందన్నది సినిమా వచ్చే వరకు వేచిఉండాల్సిందే.