Trisha Marriage : త్రిష పెళ్లి..క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్

త్రిష ప్రేమలో పడిందని, త్వరలోనే వివాహం చేసుకబోతోందనే గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. పలువురు హీరోల పేర్లు, బడా బడా బిజినెస్ మెన్ల పేర్లతో కలిపి త్రిష ప్రేమ వార్తలు వినిపించాయి.

Trisha Marriage : త్రిష పెళ్లి..క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్

Trisha

Trisha Marriage : త్రిష..ఈ భామ వెండితెర మీదకి వచ్చే ఇరవై ఏళ్ళు గడిచింది. దక్షణాది అన్ని భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించిన ఈమె..ప్రేక్షకులను మన్ననలు పొందారు. ఈమె వయస్సు 40కి చేరువులో ఉండడంతో వివాహంపై రకరకాల వార్తలు వచ్చాయి. త్రిష ప్రేమలో పడిందని, త్వరలోనే వివాహం చేసుకబోతోందనే గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. పలువురు హీరోల పేర్లు, బడా బడా బిజినెస్ మెన్ల పేర్లతో కలిపి త్రిష ప్రేమ వార్తలు వినిపించగా వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడి.. అతడితో నిశ్చితార్థం చేసుకుంది.

Read More : Covid : కరోనా లేదు, అయినా..బ్లాక్ ఫంగస్..ఎలా వచ్చిందో

అయితే నిశ్చితార్థం తర్వాత వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఓ కోలీవుడ్ దర్శకుడితో త్రిష ప్రేమలో పడిందని.. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఓ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించగా.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తుంది. దీనిపై ఆమె పీఆర్ టీమ్ చెక్ పెట్టింది. చెన్నైకి చెందిన సినిమా దర్శకుడితో వివాహం చేసుకోబోతున్నారంటూ..వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించింది. ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ లో త్రిష పాల్గొంటున్నారు.