Trisha: మళ్ళీ ప్రేమలో పడ్డ త్రిష.. కోడై కూస్తున్న కోలీవుడ్!

త్రిష వెండితెర మీదకి వచ్చే ఇరవై ఏళ్ళు గడిచింది. దక్షణాది అన్ని భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించింది. ఈ చెన్నై చంద్రం వయసు కూడా నలభైకి చేరువలో ఉంది. కానీ.. పెళ్లి ఘడియలు మాత్రం దగ్గరదాకా వచ్చి వెనక్కి వెళ్తున్నాయి.

Trisha: మళ్ళీ ప్రేమలో పడ్డ త్రిష.. కోడై కూస్తున్న కోలీవుడ్!

Trisha

Trisha: త్రిష వెండితెర మీదకి వచ్చే ఇరవై ఏళ్ళు గడిచింది. దక్షణాది అన్ని భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించింది. ఈ చెన్నై చంద్రం వయసు కూడా నలభైకి చేరువలో ఉంది. కానీ.. పెళ్లి ఘడియలు మాత్రం దగ్గరదాకా వచ్చి వెనక్కి వెళ్తున్నాయి. త్రిష ప్రేమలో పడిందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని గత ఐదారేళ్ళగా వింటూనే ఉన్నాం. ఆ మధ్య నిశ్చతార్ధం కూడా జరగగా పెళ్లి వరకు వెళ్లకుండానే అది కటీఫ్ అయిపొయింది.

అంతకు ముందు పలువురు హీరోల పేర్లు, బడా బడా బిజినెస్ మెన్ల పేర్లతో కలిపి త్రిష ప్రేమ వార్తలు వినిపించగా వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడి.. అతడితో నిశ్చితార్థం చేసుకుంది. అయితే నిశ్చితార్థం తర్వాత వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే త్రిషకు ఓ బిజినెస్‌ మ్యాన్‌తో పెళ్లి నిశ్చయమైందని వార్తలు వినిపించగా అది కేవలం పుకారు అని తేలింది.

ఇక, ఇప్పుడు ఓ కోలీవుడ్ దర్శకుడితో త్రిష ప్రేమలో పడిందని.. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఓ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించగా.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్ కోడై కూస్తుంది. ఇంత జరుగుతున్నా త్రిష నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఏమో నిజమేనేమో అంటూ ఇండస్ట్రీలో వారే అనుమానిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం త్రిష నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది.