Trisha : దుబాయ్ నుంచి అరుదైన గౌరవం అందుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ గా త్రిష

మన ఇండియాకి సంబంధించి చాలా తక్కువ మందికి ఈ 'గోల్డెన్ వీసా'ని దుబాయ్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ గోల్డెన్ వీసా ఉంటే దుబాయ్ కి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వెళ్లొచ్చు, రావొచ్చు

Trisha : దుబాయ్ నుంచి అరుదైన గౌరవం అందుకున్న ఫస్ట్ సౌత్ హీరోయిన్ గా త్రిష

Trisha

Trisha :  ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలి అంటే వీసా కంపల్సరీ. కొన్ని దేశాలకి వీసా రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. కొన్నిటికి ఈజీగా వస్తుంది. కొన్ని దేశాల్లో అక్కడికి రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి, సెలబ్రిటీలకు స్పెషల్ వీసాలు జారీ చేస్తారు. అందులో దుబాయ్ ఒకటి. మన ఇండియా నుంచి చాలా మంది దుబాయ్ కి వెళ్తూ ఉంటారు, వస్తు ఉంటారు. ఇక సినిమా వాళ్ళు షూటింగ్స్ పరంగా రెగ్యులర్ గా దుబాయ్ వెళ్తూ వస్తు ఉంటారు. దుబాయ్ లో మన ఈవెంట్స్ చాలా జరుగుతాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కొంతమంది స్పెషల్ పర్సన్స్ కి స్పెషల్ వీసాని జారీ చేస్తుంది. ఆ స్పెషల్ వీసాని ‘గోల్డెన్‌ వీసా’ అంటారు.

Natyam Movie : ఇండస్ట్రీ టాప్ పీఆర్వోలు వంశీ, శేఖర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ‘నాట్యం’ డైరెక్టర్

మన ఇండియాకి సంబంధించి చాలా తక్కువ మందికి ఈ ‘గోల్డెన్ వీసా’ని దుబాయ్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ గోల్డెన్ వీసా ఉంటే దుబాయ్ కి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వెళ్లొచ్చు, రావొచ్చు వీసా ప్రాసెస్ లేకుండా. ఇలా మన దేశంలో షారుఖ్, మోహన్ లాల్, మమ్ముట్టి, సింగర్ చిత్ర, దుల్కర్ సల్మాన్, సానియా మీర్జా లాంటి అతి కొద్ది మంది స్టార్స్ కి మాత్రమే దుబాయ్ ఈ గోల్డెన్ వీసా ఇచ్చింది. తాజాగా సౌత్ హీరోయిన్ త్రిషకి ‘గోల్డెన్ వీసా’ అందించారు. ఈ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్‌గా, తొలి సౌత్ హీరోయిన్ గా త్రిష నిలిచారు.

Adipurush Movie : ‘ఆదిపురుష్’లో ప్రభాస్ షూటింగ్ పూర్తి

సోషల్‌ మీడియా వేదికగా వీసా అందుకుంటున్న ఫొటోని షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది త్రిష. దుబాయ్ ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ట్రై చేస్తుంది. దీంట్లో భాగంగానే వేరే దేశాల ప్రముఖులకు గోల్డెన్ వీసాలు ఇస్తుంది. అంతే కాక సినిమా షూటింగ్స్ కి పర్మిషన్స్ త్వరగా ఇస్తుంది. మరో వైపు క్రికెట్ మ్యాచ్ లు కూడా నిర్వహిస్తుంది.