Trisha: మళ్లీ ఆ ఇద్దరు హీరోలతో త్రిష రొమాన్స్.. ఈసారి ఎలా ఉంటుందో?

సౌత్ స్టార్ బ్యూటీ త్రిష గతకొన్నేళ్లుగా తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అయితే వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న త్రిషకు ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్-1’ మూవీతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో త్రిష పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడంతో, ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Trisha: మళ్లీ ఆ ఇద్దరు హీరోలతో త్రిష రొమాన్స్.. ఈసారి ఎలా ఉంటుందో?

Trisha To Romance Ajith And Vijay Once Again

Trisha: సౌత్ స్టార్ బ్యూటీ త్రిష గతకొన్నేళ్లుగా తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అయితే వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న త్రిషకు ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్-1’ మూవీతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో త్రిష పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడంతో, ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Trisha: వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని త్రిష అందాలు!

అయితే ఈ క్రమంలో ఆమె తమిళ స్టార్ హీరోలైన విజయ్, అజిత్‌లతో మరోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోందట. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు నటించబోయే సినిమాల్లో త్రిష హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. విజయ్ నటించబోయే సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండగా, ఆమె ఆయన డైరెక్షన్‌లో నటించేందుకు అంగీకరించింది. ఇక మరో స్టార్ హీరో అజిత్ 62వ చిత్రాన్ని దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమాలో త్రిషను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు.

Trisha : పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ లో నిజమైన బంగారు నగలే వాడాము..

గతంలో ఈ ఇద్దరు హీరోలతోనూ త్రిష నటించి మెప్పించింది. వారిద్దరితో త్రిష చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో త్రిష నటిస్తుండటంతో ఈ సినిమాలపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇక త్రిష నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాంగీ’ డిసెంబర్ 30న రిలీజ్‌కు రెడీ అయ్యింది. మరి త్రిష ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.