Trisha: విజయ్‌తో రొమాన్స్‌కు రెడీ అయిన త్రిష..!
తమిళ స్టార్ హిరో విజయ్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 67వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తన లాస్ట్ మూవీ ‘వారిసు’ని దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ హీరో, ఇప్పుడు మరోసారి సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మాస్టర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం.

Trisha: తమిళ స్టార్ హిరో విజయ్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 67వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. తన లాస్ట్ మూవీ ‘వారిసు’ని దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ హీరో, ఇప్పుడు మరోసారి సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మాస్టర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం.
Trisha: త్రిష కొత్త మూవీ.. నెలలోపే అందులో ప్రత్యక్షం..!
ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే, కోలీవుడ్ వర్గాలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై హైప్ కూడా పెరిగిపోయింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. కాగా ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రాబోతుందనే వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Trisha: మళ్లీ ఆ ఇద్దరు హీరోలతో త్రిష రొమాన్స్.. ఈసారి ఎలా ఉంటుందో?
త్రిష గతంలోనూ విజయ్ సరసన పలు సినిమాల్లో నటించింది. కాగా, వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చి దాదాపు 15 ఏళ్లు కావస్తుండగా, ఇప్పుడు మరరోసారి ఈ జోడీ మనముందుకు రాబోతుండటంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో ఈ సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది.
Vantom.. Neenga keta update idho ?
After 14 years, Get ready to meet the sensational on-screen pair once again ❤️#Thalapathy @actorvijay sir – @trishtrashers mam#Thalapathy67Cast #Thalapathy67 @Dir_Lokesh @Jagadishbliss pic.twitter.com/7kvd7570ti— Seven Screen Studio (@7screenstudio) February 1, 2023