SSMB28: మహేష్ మూవీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న త్రివిక్రమ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన నెక్ట్స్ చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన నెక్ట్స్ చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

SSMB28 : SSMB28 న్యూ షెడ్యూల్ అప్డేట్..

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న SSMB28 మూవీ, ప్రస్తుతం తన నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కోసం రెడీ అవుతుంది. ఇక ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు త్రివిక్రమ్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఇక ఈ షెడ్యూల్‌లో మహేష్ అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త లుక్‌తో అభిమానులను స్టన్ చేయనున్నాడు.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీ కోసం జగ్గుభాయ్ సరికొత్త మేకోవర్!

ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి ట్రీట్ ఇస్తాడా.. ఈ సినిమాను త్రివిక్రమ్ ఎలాంటి కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాడా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.