Trivikram Srinivas : ‘భామ కలాపం’ నృత్యరూపకంతో అందర్నీ ఆకట్టుకున్న త్రివిక్రమ్ సతీమణి..
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన డైలాగ్స్ తో అందర్నీ మాయలో పడేస్తుంటే, అతని సతీమణి నాట్య కళతో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ శనివారం హైదరాబాద్ రవీంద్రభారతి కళా వేదికలో 'భామ కలాపం' నృత్యరూపకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె తన కళని వేదిక పై ప్రదర్శించి అందర్నీ తన నైపుణ్యంతో మంత్రముగ్దుల్ని చేసింది.

Trivikram Srinivas : టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన డైలాగ్స్ తో అందర్నీ మాయలో పడేస్తుంటే, అతని సతీమణి నాట్య కళతో అందర్నీ ఆకట్టుకుంటుంది. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. ఈమె ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలు. త్రివిక్రమ్, సౌజన్య ఇద్దరు కలిసే చదువుకున్నారు. 2002లో వీరిద్దరికి పెళ్లయింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సౌజన్య నాట్య కళలో కూడా ప్రావిణ్యం సంపాదించుకుంది.
SSMB28: మహేష్ సినిమా నుండి తప్పుకున్న హీరోయిన్.. కారణం అదేనా..?
తాజాగా ఆమె తన కళని వేదిక పై ప్రదర్శించి అందర్నీ తన నైపుణ్యంతో మంత్రముగ్దుల్ని చేసింది. ఈ శనివారం హైదరాబాద్ రవీంద్రభారతి కళా వేదికలో ‘భామ కలాపం’ నృత్యరూపకం నిర్వహించారు. ప్రముఖ నృత్య గురువు పసుమర్తి రామలింగం శాస్త్రి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో సౌజన్య తన నాట్యాన్ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యి.. తన సతీమణి నృత్య ప్రదర్శన చూసి అందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా త్రివిక్రమ్ ప్రెజెంట్ SSMB28 చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ బాబుతో మూడోసారి జతకడుతూ చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది ఘనంగా మొదలైన ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రెండు షెడ్యూల్ కి చాలా గ్యాప్ రావడంతో.. ఈ సినిమాపై అనేక రూమర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీ కోసం అనుకున్న మొదటి కథని పక్కన పెట్టేసినట్లు, దీంతో మొదటి షెడ్యూల్ లో తీసిన భారీ యాక్షన్ సీన్స్ కూడా పక్కన పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.