మనసుకు దురద పుడితే గోక్కునే దువ్వెనే సంగీతం: త్రివిక్రమ్

మనసుకు దురద పుడితే గోక్కునే దువ్వెనే సంగీతం: త్రివిక్రమ్

అల వైకుంఠపురం సినిమా మ్యూజిక్ కన్సర్ట్ సందడి సందడిగా జరిగింది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో అట్టహాసంగా వేడుకలు నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్షన్ చెప్పగా అల్లు అరవింద్, రాధాకృష్ణలు లాంఛ్ చేశారు.

ఈ వేడుకలో త్రివిక్రమ్ మరోసారి ఆయన మాటలతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. మనసుకు దురద పుడితే గోక్కునే దువ్వెనే సంగీతం లాంటి సరదామాటలతో ఆకట్టుకున్నారు. 

* సాయంత్రం 3 నుంచి 4గంటల మధ్యలో 10×20 రూంలో 30ఏళ్ల వ్యక్తి.. 60ఏళ్ల వ్యక్తి ఒకరు స్థాయి తగ్గి.. మరొకరు స్థాయి పెంచుకుని రాసిన పాట సామజగరమణ. 
* ఆడపిల్ల దొంగతనంగా వెళ్లిపోయే అబ్బాయిని గుర్తు చేసుకుంటూ వినడానికి అద్భుతమైన పాటను మనకు ఇచ్చారు. తన గొంతునిచ్చిన సిద్ శ్రీరామ్ మన జీవితాల్లోకి తీసుకొచ్చాడు. 
* అందమైన పాటలను కచ్చితంగా గౌరవించాలనిపించే మ్యూజికల్ నైట్ అనిపెట్టాం. 
* ఈ కోరికను బయటకు తీసుకొచ్చిన వ్యక్తి అల్లు అర్జున్
* దీని కోసం రాత్రి 2గంటల వరకూ పనిచేశాం. 
* మా కలను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రొడ్యూసర్ మంచి సపోర్ట్ ఇచ్చారు.
* సంగీతం అంటే మనసు దురదపుట్టినప్పుడు గోక్కునే దువ్వెనలాంటిది.
* మీరు మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా.
* ఇక్కడ ఉన్న మ్యూజిక్ ఆర్టిస్టులకు ప్రత్యేక కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లు కొట్టండి.
* సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిది ప్రత్యేక స్థాయి. 
* సినిమాలో పనిచేసిన ప్రతిఒక్కరూ నా మనసుకు తగిలినవారే. 

* ఈ సినిమాకు మొదలు.. చివర అల్లు అర్జునే.
* ఆయన ఆఫీసు బాల్కనీలో కూర్చొని ఆనందంగా సంతోషంగా స్టోరీ చేద్దాం సార్.. అని చెప్పారు. 
* కాకినాడలో కూర్చొని మాట్లాడుకుంటుంటే పాటలు రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా చేయాలని చెప్పింది అల్లు అర్జునే. 
* బన్నీ పిల్లలు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
* పారిస్ సినిమా షూటింగ్ కు తీసుకెళ్తే నా భార్య రెండ్రోజులు ఉండి వెళ్లిపోయింది.
* మీరందరి ప్రేమా మా మీద ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నా.