హాట్ లుక్స్ తో కియారా…నెటిజన్ ట్వీట్ కు ఫన్నీ రిప్లై

  • Published By: venkaiahnaidu ,Published On : September 9, 2019 / 07:04 AM IST
హాట్ లుక్స్ తో కియారా…నెటిజన్ ట్వీట్ కు ఫన్నీ రిప్లై

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే  ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్న హీరోయిన్ కియారా అద్వాణీ. ఈ ఒక్క మూవీతోనే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈ భామ..రామ్ చరణ్ సరసన వినయవిధేయ రామలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.  ఆ సినిమాలో తన పరిధి మేరకు నటనతో ఆకట్టుకోవడమే కాకుండా అంద చందాలతో తెలుగువారిని భాగానే ఆకర్షించింది. అయితే  భారీ అంచనాతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో  టాలీవుడ్ కి గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఇటీవల కియారా నటించిన తెలుగు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్   కబీర్ సింగ్ మూవీ బాలీవుడ్ బాక్సీఫీస్ దగ్గర ఘన విజయం సాధించడంతో ఈ అమ్మడికి బాలీవుడ్ నిర్మాతల నుంచి వరుస ఆఫర్లు వస్తుండటంతో ఇక టాలీవుడ్ కి దాదాపు టాటా చెప్పేసింది. 

కబీర్ సింగ్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ సుందరి…ఇప్పుడు హాట్‌గా ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. తన అందచందాలను ఆరబోసి దిగిన కొన్ని ఫోటోలను కియారా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నెటిజెన్స్ ఆ ఫోటో షూట్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. కియారా అద్వానీ ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పసుపు రంగులో ధగధగ మెరిసిపోయే డ్రెస్‌లో హాట్‌ లుక్‌తో ఉన్న ఫొటోపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.

అందులో కొందరూ ‘మ్యాగీ’ న్యూడిల్స్‌తో పోలుస్తూ కామెంట్లు పెడుతూ… ‘మీకు మ్యాగీ చాలా ఇష్టం అని తెలుస్తోంది.  తిని.. తిని బోర్‌ కొట్టిందనుకుంటా.. అందుకే దానితో ఇలా గౌను చేయించుకుంది అంటూ కామెంట్‌ చేశాడు.  అయితే కియారా అంతే సరదాగా రిప్లై ఇస్తూ.. హాహాహా..రెడీ అయ్యేందుకు రెండు నిమిషాలే పట్టింది’ అంటూ  కామెంట్ చేసింది. కియారా ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ‘లక్ష్మీబాంబ్‌’ అనే ఓ హారర్ కామేడీలో అక్షయ్ కూమార్ సరసన నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో లారెన్స్ డైరక్షన్ లో వచ్చిన కాంచనకు రీమేక్‌ గా వస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

?

A post shared by KIARA (@kiaraaliaadvani) on