Trolls On Actress: ట్రోల్ అవుతున్న హీరోయిన్స్.. నెటిజన్స్ ఎటాక్!

ఫోటో షూట్స్ తోనో, సినిమా షూటింగ్స్ తోనో్ న్యూస్ లో కొస్తారు హీరోయిన్స్. కానీ, సోషల్ మీడియా వచ్చాక ఏం చేసినా వార్తల్లోకొస్తున్నారు. ఇమిడియెట్ గా ట్రోల్ చేసి తమ రియాక్షన్స్ ను..

Trolls On Actress: ట్రోల్ అవుతున్న హీరోయిన్స్.. నెటిజన్స్ ఎటాక్!

Trolls On Actress

Trolls On Actress: ఫోటో షూట్స్ తోనో, సినిమా షూటింగ్స్ తోనో్ న్యూస్ లో కొస్తారు హీరోయిన్స్. కానీ, సోషల్ మీడియా వచ్చాక ఏం చేసినా వార్తల్లోకొస్తున్నారు. ఇమిడియెట్ గా ట్రోల్ చేసి తమ రియాక్షన్స్ ను వెంటనే పోస్ట్ చేస్తున్నారు నెటిజన్స్. లేటెస్ట్ గా ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే, కాజల్ ట్రోలింగ్ భారినపడ్డారు.

Bheemla Nayak: ఏపీ ప్రభుత్వ సానుకూలం.. భీమ్లా ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

ఫిబ్రవరి 6న గానకోకిల లతా మంగేష్కర్ మరణ వార్త అందర్నీ శోకసంద్రంలో ముంచేసింది. ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరంటూ బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది సంతాపం ప్రకటించారు. ఐశ్వర్యరాయ్ మాత్రం లేట్ గా రెస్పాండ్ అయ్యింది. ఫిబ్రవరి 8న తన ఇన్ స్టాలో మీ ఆత్మశాంతించాలి లతాజీ లతా మంగేష్కర్ ఫోటో సెండ్ చేసింది. అంతే, ఇప్పుడే నిద్రలేచారా?, మీకు ఈ న్యూస్ ఇప్పుడే తెలిసిందా? అంటూ ట్రోలింగ్స్ తో ఐశ్వర్యరాయ్ మీద ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. తను ఫోన్ వాడటం లేదంటూ వెనకేసుకొస్తున్నారు ఐశ్వర్య ఫాన్స్.

Saniya Iyappan: హీరోయిన్ ఆరుబయట స్నానం.. నెటిజన్ల ఆగ్రహం!

మన ట్రోలింగ్ లిస్ట్ లో మరో హీరోయిన్ దీపికా పదుకునే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వరస సినిమాలు చేస్తున్న దీపికా లేటెస్ట్ మూవీ గెహ్రాయాన్. ఈనెల 11న డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ రెచ్చిపోయి నటించింది. దాంతో మీ హస్బెండ్ పర్మిషన్ తీసుకున్నావా? అంటూ నెటిజన్లు కూడా దీపిక మీద ట్రోలింగ్స్ తో రెచ్చిపోతున్నారు. దానికి లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆన్సరిస్తూ ఆ ట్రోలింగ్స్ కు స్పందించడం కూడా మూర్ఖత్వమే అంది. గెహ్రియాన్ సినిమాలో తన నటనను తన భర్త కూడా మెచ్చుకుంటాడంది.

Son of India: లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు.. ట్రైలర్ ఎప్పుడంటే?

తెలుగులో మోసగాళ్లు సినిమాతో లాంగ్ గ్యాప్ తీసుకున్న కాజల్ బాడీ షేమింగ్ పైన నెటిజన్లు ట్రోల్ చేశారు. దానికి గట్టి కౌంటరిచ్చింది కాజల్ అగర్వాల్. రీసెంట్ గా తన సిస్టర్ నిషా అగర్వాల్ కొడుకుతో ఒక యాడ్ వీడియో చేసింది కాజల్. అందులో కాజల్ అగర్వాల్ బాడీ గురించి నెగటివ్ కామెంట్స్ చేశారు నెటిజన్స్. లేటెస్ట్ గా భారీ రిప్లయ్ ఇచ్చింది కాజల్. నా లైఫ్ లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిని ఆస్వాదిస్తున్నా. ప్రెగ్నెంట్ లేడీ బాడీ లో చాలా మార్పులొస్తాయి. నా బతుకు నన్ను బతకనివ్వండి, మీ బతుకు మీరు బతకండి అంటూ ఘాటుగా స్పందించింది. కాజల్.