యాక్షనా.. ఓవర్ యాక్షనా!! రైలు మీద రన్నింగ్.. రోబో, రావన్‌లను మించిపోయిన కూలీ నెం.1

యాక్షనా.. ఓవర్ యాక్షనా!! రైలు మీద రన్నింగ్.. రోబో, రావన్‌లను మించిపోయిన కూలీ నెం.1

Coolie No. 1: వరుణ్ ధావన్.. సారా అలీ ఖాన్ లు నటించిన Coolie No. 1 ఆన్‌లైన్‌లో శుక్రవారం రిలీజ్ అయింది. గోవిందా, కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో కనిపించిన 1995 కూలీ నెం.1 రీమేక్ ను ఇప్పుడు మళ్లీ రెడీ చేశారు. ఈ సినిమాలో ఎవరూ ఊహించనంత, నమ్మలేనంత సీన్‌ను తెరకెక్కించారు. అది చూసిన నెటిజన్లు యాక్షన్ సీన్‌కు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కదులుతున్న ట్రైన్ పైకెక్కి దాని కంటే వేగంగా పరిగెత్తడమే కాకుండా రైల్వే ట్రాక్ మీద ఉన్న బుడ్డోడ్ని కాపాడతాడు.

ఈ సీన్ చూస్తుంటే రోబో.. రా వన్‌లకు మించిపోయినట్లు ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫీట్లు, స్టంట్లు ఏంటి బాబూ.. ఇది యాక్షనా.. ఓవర్ యాక్షనా కాస్త చెప్పండయ్యా అని ట్రోల్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు ఈ కూలీ నెం.1 సినిమా సీన్ గురించి..

అసలు ఆ సీన్ ఏంటంటే..
ఓ మహిళ రైల్వే ప్లాట్ ఫాం మీద నిలబడి బాధపడుతూ ఉంటుంది. ఆమె కొడుకు రైల్వే పట్టాల మీద కూర్చొని ఉండటం, అదే సమయానికి రైలు వస్తుందని అనౌన్స్ చేయడంతో ప్లాట్ ఫాం మీద ఉన్నవారు, ఆ మహిళ భయాందోళనలో ఉంటారు. అప్పుడే రైల్వే బ్రిడ్జి మీద వెళ్తున్న మన హీరో వరుణ్ ధావన్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. దాని పై నుంచే దూకడంతోనే నేరుగా రైలు మీద దొర్లుకుంటూ లేచి నిలబడి పరిగెత్తడం మొదలుపెడతాడు.

ఆ ప్లాట్ ఫాం మీద ఉన్న వాళ్లంతా ఇక ఆ బాబును ఎవరూ కాపాడలేరని ఫిక్స్ అయిపోయి బాధపడుతుంటారు. ఆ సమయంలోనే రైలు కోచ్ లపైన మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చిన వరుణ్ ధావన్ నేరుగా పట్టాల మీదకు దూకుతాడు. సెకను కంటే తక్కువ టైం గ్యాప్‌లో ఆ బుడ్డోడ్ని పట్టుకుని రైలు పట్టాల పక్కకు పెట్టేస్తాడు. ఆ తర్వాత ప్లాట్ ఫాంపైన ఉన్న వాళ్లమ్మ దగ్గరకు చేరుస్తాడు. ఈ సీన్ చూసిన వాళ్లంతా ముందు యాక్షన్ సీన్ అనుకున్నా పూర్తయ్యేసరికి ఫన్నీ రియాక్షన్లే ఇస్తున్నారట.