Tuck Jagadish : నాని నిర్మాతలు సేఫ్.. ప్రాఫిట్ ఎంతంటే..

‘టక్ జగదీష్’ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసినా సరే.. నిర్మాతలు సాలిడ్ ప్రాఫిట్ పొందారు..

Tuck Jagadish : నాని నిర్మాతలు సేఫ్.. ప్రాఫిట్ ఎంతంటే..

Tuck Jagadish

Tuck Jagadish: నేచురల్ స్టార్ నాని హీరోగా.. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘టక్ జగదీష్’.. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు.

Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..

థియేట్రికల్ రిలీజ్ పలుసార్లు పోస్ట్ పోన్ అవడం, ఇంతలో సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందని ప్రచారం.. ఓటీటీలో రిలీజ్ చేస్తే నాని సినిమాలు కొనం అని డిస్ట్రిబ్యూటర్లు కామెంట్స్ చెయ్యడం.. ఒకవేళ ప్రస్తుత పరిస్థితులు బాగుండి కూడా నా సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసే పరస్థితి వస్తే నన్ను నేనే బ్యాన్ చేసకుంటానని నాని అనడం.. ఇలా నానా హంగామా జరిగిన తర్వాత.. వేరే దారి లేదు కాబట్టి సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నామని తెలుపుతూ నిర్మాతలు తెలుగు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు.

Laal Singh Chaddha : నాగ చైతన్య క్యారెక్టర్ నేను చెయ్యాల్సింది..

వినాయక చవితి కానుకగా ఈనెల 9న ‘టక్ జగదీష్’ అమెజాన్‌లో ప్రీమియర్ అవుతోంది. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇన్నాళ్లూ వెయిట్ చేసి సినిమాను ఓటీటీలో వదిలారు అంటూ ప్రాఫిట్ గట్టిగానే వచ్చి ఉంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ‘టక్ జగదీష్’ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. బడ్జెట్ – 34 కోట్లు.. ఓటీటీ రైట్స్ – 37 కోట్లు.. శాటిలైట్ రైట్స్ – 7.5 కోట్లు.. హిందీ రైట్స్ – 5 కోట్లు.. ఆడియో రైట్స్ – 2 కోట్లు.. ఈ లెక్కన నిర్మాతలకు 17.5 కోట్లు ప్రాఫిట్ వచ్చింది.

Tuck Jagadish : అలాగైతే నాకు నేనే బ్యాన్ చేసుకుంటాను..