Veerasimha Reddy : టర్కీలో వీరసింహారెడ్డి యూనిట్ పై పోలీసులకి కంప్లైంట్స్ ఇచ్చిన స్థానికులు..

ఈ షోలో వీరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడారు. సినిమాకి సంబంధించిన విశేషాల గురించి చెప్పారు. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ కొంతభాగం టర్కీలో జరిగిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ గోపీచంద్ మలినేని టర్కీలో జరిగిన ఓ సంఘటనని ఆడియన్స్ కి తెలిపాడు. గోపీచంద్ మాట్లాడుతూ.................

Veerasimha Reddy : టర్కీలో వీరసింహారెడ్డి యూనిట్ పై పోలీసులకి కంప్లైంట్స్ ఇచ్చిన స్థానికులు..

Turkey people gives complaints to police on Veerasimha Reddy unit

Veerasimha Reddy :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం సీజన్ 2 ఆహా ఓటీటీలో సాగుతుండగా ఇటీవలే ప్రభాస్, గోపీచంద్ తో కలిసి బాహుబలి ఎపిసోడ్స్ అంటూ రెండు ఎపిసోడ్స్ ని స్ట్రీమ్ చేయగా వీటికి బాగా రెస్పాండ్ వచ్చింది. ఇక ఇప్పటికే పలు ఎపిసోడ్స్ అవ్వగా తాజాగా వీరసింహారెడ్డి చిత్రయూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వీరసింహారెడ్డి సినిమా యూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, వరలక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్, రచయిత సాయి మాధవ్ బుర్రా, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ షోకి వచ్చి బాలయ్యతో కలిసి అలరించారు.

Gopichand Malineni : నమ్మిన వాళ్ళు మోసం చేసారంటూ అన్‌స్టాపబుల్ స్టేజిపై ఏడ్చేసిన డైరెక్టర్ గోపీచంద్..

ఈ షోలో వీరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడారు. సినిమాకి సంబంధించిన విశేషాల గురించి చెప్పారు. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ కొంతభాగం టర్కీలో జరిగిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ గోపీచంద్ మలినేని టర్కీలో జరిగిన ఓ సంఘటనని ఆడియన్స్ కి తెలిపాడు. గోపీచంద్ మాట్లాడుతూ.. టర్కీలో ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నాం. ఇక్కడ రాయలసీమ ఫ్యాక్షన్ ఫైట్ ని అక్కడ ప్లాన్ చేశాం. కొంతమంది రౌడీలు కత్తి పట్టుకొని పరిగెడుతూ, విలన్ దునియా విజయ్ మొహం అంతా రక్తం, చేతిలో కత్తి చూసి అక్కడి స్థానికులు భయపడ్డారు. అక్కడ నిజంగానే మర్డర్ జరుగుతుందని అనుకోని చాలా మంది టర్కీ వాళ్ళు అక్కడి పోలీసులకి కంప్లైంట్స్ ఇచ్చారు మా మీద. ఇంత వయోలెన్స్ వాళ్ళు ఇప్పటిదాకా చూడలేదంట. అందుకే అది నిజం అనుకోని మా మీద పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు అని తెలిపాడు.