Actor : భార్య ఆత్మహత్య.. ఆపై టీవీ నటుడు హత్య..

 కర్ణాటక మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ నటుడు సతీష్‌ వజ్ర బెంగళూరులో హత్యకు గురయ్యాడు. పలు యూట్యూబ్ ఛానల్స్, టీవీ సీరియల్స్ లో నటించిన సతీష్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో..............

Actor : భార్య ఆత్మహత్య.. ఆపై టీవీ నటుడు హత్య..

Satheesh Vajra

Actor :  కర్ణాటక మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ నటుడు సతీష్‌ వజ్ర బెంగళూరులో హత్యకు గురయ్యాడు. పలు యూట్యూబ్ ఛానల్స్, టీవీ సీరియల్స్ లో నటించిన సతీష్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తున్నాడు. మూడు నెలల క్రితమే సతీష్ భార్య ఆత్మహత్య చేసుకుంది. తాజాగా నటుడు సతీష్ హత్యకి గురవ్వడంతో ఈ వార్త సంచలనంగా నిలిచింది.

Virataparvam : విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

కొంతమంది దుండగులు ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేసి సతీష్ ని చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సతీష్ భార్య ఆత్మహత్య చేసుకోవడంతో, ఇతని వల్లే చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు సతీష్ పై పగ పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో సతీష్ భార్య తమ్ముడే ఈ హత్యకి పాల్పడి ఉంటాడని సతీష్ కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.