దొంగగా మారిన నటి.. ప్రియుడు అరెస్ట్.. పరారీలో సుచిత్ర..

10TV Telugu News

serial actress Suchitra turns thief: కరోనా జనజీవనాన్ని చిన్నాభిన్నం చేసేసింది.. లాక్‌డౌన్ వల్ల అన్నిరంగాలతో పాటు సినీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. షూటింగులు లేక చిన్నా చితకా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలా ఇబ్బందులు పడ్డారు.. ఇంకా పడుతున్నారు.


ఈ నేపధ్యంలో కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ నటి దొంగగా మారడం కలకలం రేపింది. తన ప్రియుడుతో కలిసి చోరీకి పాల్పడింది. ప్రియుడు పోలీసులకు చిక్కగా ఆమె పరారీలో ఉంది.


వివరాళ్లోకి వెళ్తే.. కోలీవుడ్‌కు చెందిన సుచిత్ర తమిళ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. నటీనటులకు డ్రైవర్‌గా పనిచేస్తున్న మణికందన్‌తో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. సాఫీగా సాగుతున్న వీరి ప్రయాణంలో కరోనా కల్లోలం రేపింది. దొంగతనం చేయాలని ఫిక్స్ అయిన సుచిత్ర రెక్కీ నిర్వహించి ప్రియుడు మణికందన్ ఇంట్లోనే దొంగతనానికి ప్లాన్ చేసింది.


ఈ క్రమంలో అతని తల్లిదండ్రులు పొలం పనికి వెళ్లగా రూ.50 వేల నగదు, 18 సవర్ల బంగారం చోరీ చేశారు.మణికందన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మణికందన్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా సుచిత్ర పరారీలో ఉంది. పోలీసులు ఆమెకోసం గాలింపు చర్యలు చేపట్టారు. నటి సుచిత్ర చోరీ చేసిందనే వార్త తమిళనాట సంచలనంగా మారింది.