BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఇద్దరు అవుట్..

ఈ వారం ఆరో వారం ఎలిమినేషన్ కూడా పూర్తయింది. ఈ వారంలో మొత్తం 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు. మిత్రా శర్మ, బిందు మాధవి, యాంకర్ శివ, మహేష్ విట్టా, హమీదా, ముమైత్ ఖాన్..............

BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఇద్దరు అవుట్..

BiggBoss Non Stop :  బిగ్‌బాస్ నాన్ స్టాప్ పేరుతో నాగార్జున హోస్ట్ గా ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అంతకు ముందు ఉన్న క్రేజ్ మాత్రం లేదు. బిగ్‌బాస్ అభిమానులు, అందులో ఉన్న కంటెస్టెంస్ట్ అభిమానులు తప్ప ఈ షోని పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్, ఆ తరువాత శ్రీరాపాక, మూడో వారంలో ఆర్జే చైతూ, నాలుగో వారం సరయు, ఐదో వారం తేజస్వి ఎలిమినేట్ అయింది. అయితే ముమైత్ ని పంపించేసినట్టే పంపించి మళ్ళీ తీసుకొచ్చారు.

ఇక ఈ వారం ఆరో వారం ఎలిమినేషన్ కూడా పూర్తయింది. ఈ వారంలో మొత్తం 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు. మిత్రా శర్మ, బిందు మాధవి, యాంకర్ శివ, మహేష్ విట్టా, హమీదా, ముమైత్ ఖాన్, అజయ్, అషు రెడ్డి, స్రవంతి, నటరాజ్ మాస్టర్.. వీరంతా ఈ సారి నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఈ సారి ఎవ్వరూ ఊహించనట్టుగా డబుల్‌ ఎలిమినేషన్‌తో సర్‌ప్రైజ్‌ చేశాడు నాగార్జున.

Konidela Production: పాన్ ఇండియా స్టార్‌గా చరణ్.. ఇక కొణిదెల ప్రొడక్షన్ బాధ్యతలెవరికి?

నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ కి వాళ్ళు చేసిన తప్పులు చూపించి ఫైర్ అయ్యారు. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న వాళ్లలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన లాస్ట్ ఇద్దర్ని ఎలిమినేట్ చేస్తామని తెలుపుతూ స్రవంతి, ముమైత్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. ఇక ఈ సారి స్రవంతి వెళ్లిపోతుంటే తనతో పాటు అందరూ ఎమోషనల్ అయ్యారు. స్రవంతి వెళ్లిపోతుంటే బిందుమాధవి ఏడ్చేసింది. స్రవంతి స్టేజ్ మీదకి వచ్చి షోలో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కంటే అఖిల్‌, అజయ్‌లను మిస్‌ అవుతున్నానన్న బాధే ఎక్కువగా ఉందని ఏడ్చేసింది.