Ajay – Mahesh : టాప్ 50లో రెండు ఇండియన్ సినిమాలు..

2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 50 సినిమాల లిస్ట్ విడుదలైంది..

Ajay – Mahesh : టాప్ 50లో రెండు ఇండియన్ సినిమాలు..

Ajay Mahesh

Ajay – Mahesh: కోవిడ్ కారణంగా థియేటర్లు మూత పడడంతో సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. 2020 మార్చి నెలాఖరు నాటికే థియేటర్లు మూసెయ్యడంతో కొత్త సినిమాలు విడుదలకు నోచుకోలేదు. 2020 జనవరి నుండి మార్చి వరకు రిలీజ్ అయిన వాటిలో కొన్ని సినిమాలే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. రీసెంట్‌గా 2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల లిస్ట్ విడుదలైంది. ఇందులో కేవలం రెండే రెండు భారతీయ చిత్రాలు చోటుదక్కించుకున్నాయి.

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ‘తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్’, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ టాప్ కలెక్షన్స్ మూవీస్ లిస్టులో ప్లేస్ దక్కించుకున్నాయి. అజయ్ దేవ్‌గన్, సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటించిన హిస్టారికల్ మూవీ.. ‘తాన్హాజీ : ది అన్‌సంగ్ వారియర్’.. అజయ్ హీరోగా నటించిన 100వ సినిమా ఇది.. ఓం రౌత్ దర్శకత్వంలో, అజయ్ దేవ్‌గన్ ఫిల్మ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, టాప్ 50 లిస్టులో 34వ స్థానంలో నిలిచింది.

Tanhaji

 

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత ఈ మూవీతోనే రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. దిల్ రాజు నిర్మించారు. బొమ్మ దద్దరిల్లిపోయే రేంజ్‌లో 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వరల్డ్ వైడ్ టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా 41వ ప్లేస్ దక్కించుకుంది ‘సరిలేరు నీకెవ్వరు’..

Sarileru Neekevvaru