Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ ఇంటిలో దుండగులు.. పోలీసులు విచారణలో?

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాద్‌షా అనిపించుకున్నాడు. ఇది ఇలా ఉంటే షారుఖ్ ఖాన్ ఇంటిలో ఇద్దరు దుండగులు అక్రమంగా చొరబడ్డారు. వారిని గుర్తించిన షారుఖ్ ఇంటి సిబ్బంది..

Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ ఇంటిలో దుండగులు.. పోలీసులు విచారణలో?

Shah Rukh Khan

Shah Rukh Khan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాద్‌షా అనిపించుకున్నాడు. హిందీ సినిమాలకు ఆదరణ పోయిన సమయంలో, పూర్తి వ్యతిరేకతతో పఠాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి.. ఏకంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించాడు షారుఖ్ ఖాన్. తన సినిమాతో బాలీవుడ్ కి మళ్ళీ ఊపిరి పోశాడు. ఇది ఇలా ఉంటే షారుఖ్ ఖాన్ ఇంటిలో ఇద్దరు దుండగులు అక్రమంగా చొరబడ్డారు. ముంబై లోని షారుఖ్ ఖాన్ నివాసం అయిన మన్నత్ లోకి గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు చొరబడ్డారు.

Pathaan South Collections : పఠాన్ 1000 కోట్లు సరే.. తెలుగు, తమిళ్ లో ఎంత రాబట్టిందో తెలుసా?

వారిని గుర్తించిన షారుఖ్ ఇంటి సిబ్బంది.. వారిద్దర్నీ ముంబై పోలీసులకు అప్పగించారు. ఇక వారిని విచారించిన పోలీసులకు అసలు విషయం ఏంటనేది తెలిసింది. దేశవ్యాప్తంగా షారుఖ్ ఖాన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలుసు. షారుఖ్ ని లైఫ్ లో ఒక్కసారి అయినా దగ్గర నుంచి చూస్తే చాలు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ కి చెందిన ఇద్దరు అభిమానులు షారుఖ్ ని దగ్గర నుంచి చూడాలనే ఉద్దేశంతోనే ఇంటిలోకి చొరబడినట్లు పోలిసుల విచారణ తెలిసింది.

మరే దురాలోచనలు లేవని వారిద్దరూ చెప్పినప్పటికీ పోలీసులు.. వారిద్దరి పై గతంలో ఏమన్నా కేసులు నమోదు అయినా అని విచారిస్తున్నారు. అయితే షారుఖ్ ఇంటిలోకి అక్రమంగా చొరబడినందుకు పలు సెక్షన్ ల పై వారిద్దరి పై ఇప్పుడు కేసులు నమోదు చేశారు పోలీసులు. కాగా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో షారుఖ్ డ్యూయల్ రోల్ కనిపించబోతున్నాడు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ హీరో విజయ్, దీపికా పడుకోణె గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.