Udayanidhi Stalin : నాకు అసెంబ్లీ ఉందని ఫంక్షన్ డేట్ మార్చారు..

ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ''ఒక లిరికల్ సాంగ్ ని ఇంత ఘనంగా ఆవిష్కరించడం ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. సాంగ్ చాలా........

Udayanidhi Stalin : నాకు అసెంబ్లీ ఉందని ఫంక్షన్ డేట్ మార్చారు..

Ram

The Warrior :  ‘రెడ్’ సినిమా తర్వాత రామ్ హీరోగా చేస్తున్న సినిమా ‘ది వారియర్’. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని ఒకేసారి నిర్మిస్తున్నారు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. నిన్న ఈ సినిమా నుంచి మొదటి పాట బుల్లెట్ సాంగ్ విడుదల అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

 

రామ్ కి ఇది మొదటి తమిళ సినిమా కావడంతో ఈ సాంగ్ తమిళ్ వర్షన్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. తమిళ్ మార్కెట్ కోసం ఈ పాటని తమిళ హీరో శింబుతో పాడించగా ఈ పాట తమిళ్ వర్షన్ ని చెన్నైలో ఈవెంట్ నిర్వహించి విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి తమిళ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, ఎమ్మల్యే ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధిగా వచ్చారు.

Kiara Advani : బాలీవుడ్‌లో మరో స్టార్ కపుల్ బ్రేకప్??

ఈ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ”ఒక లిరికల్ సాంగ్ ని ఇంత ఘనంగా ఆవిష్కరించడం ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. సాంగ్ చాలా బావుంది. రామ్ తో నాకు ఇంతకు ముందు పరిచయం లేదు. ఇప్పుడే పరిచయం అయ్యింది. ఐదు నిమిషాల్లో మంచి ఫ్రెండ్ అయిపోయారు. డైరెక్టర్ లింగుస్వామి ఫోన్ చేసి 21న ఈ ఫంక్షన్ కి రావాలని చెప్పినప్పుడు అసెంబ్లీ ఉందని చెప్పాను. నా కోసం ఈ ఫంక్షన్ డేట్ ని 21 నుంచి 22కు మార్చారు. లింగుస్వామి, రామ్ కలిసి చేసిన ‘ది వారియర్’ సినిమా రామ్ నటించిన విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలవాలి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. రామ్ తెలుగులో నటించిన ‘రెడ్’ సినిమా తమిళ్ వెర్షన్ ‘తడమ్’ నేను చేయాలి. కానీ, కుదరలేదు. ఇప్పుడు ‘తడమ్’ దర్శకుడు తిరుమేనితో సినిమా చేస్తున్నాను” అని చెప్పారు.