Udayanidhi Stalin : అదే నా చివరి సినిమా.. ఇకపై ప్రజలకే నా జీవితం..

ఉదయనిధి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానూ నటిస్తున్న 'మామన్నన్‌' సినిమానే తన ఆఖరి సినిమా అని తెలిపాడు. ఇటు సినిమాలు అటు రాజకీయాలు..................

Udayanidhi Stalin : అదే నా చివరి సినిమా.. ఇకపై ప్రజలకే నా జీవితం..

Stalin

Udayanidhi Stalin :  తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఒకప్పుడు హీరోగా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల కారణంగా కొన్నేళ్లు సినిమాలకి దూరంగా ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలుగు డబ్బింగ్ సినిమా ‘ఓకే ఓకే’తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు ఉదయనిధి స్టాలిన్‌. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌ నటించిన తమిళ చిత్రం ‘నెంజుకు నీధి’ సినిమా మే 20న విడుదల కానుంది.

 

బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘ఆర్టికల్‌ 15’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ న్యూస్ చెప్పారు ఉదయనిధి స్టాలిన్. ప్రస్తుతం ఉదయనిధి మారి సెల్వరాజ్ డైరెక్షన్‌లో ‘మామన్నన్‌’ అనే సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్‌ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా ఫహాద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించనున్నారు.

Samuthirakani: క్రేజీ విలన్.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.. సముద్రఖని రెండు పడవల ప్రయాణం!

ఉదయనిధి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తానూ నటిస్తున్న ‘మామన్నన్‌’ సినిమానే తన ఆఖరి సినిమా అని తెలిపాడు. ఇటు సినిమాలు అటు రాజకీయాలు రెండూ బ్యాలెన్స్‌ చేయలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు, ఇకపై తన తండ్రి బాటలోనే ప్రజల కోసమే నా జీవితం అని తెలిపాడు. అయితే సీఎం స్టాలిన్ ఉదయానిధిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఒకవేళ స్టాలిన్ మంత్రి అయితే అప్పుడు సినిమాలు చేయడానికి మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే సినిమాలు ఆపేద్దామని నిర్ణయం తీసుకున్నట్టు తమిళ సినీ, రాజకీయ వర్గాల సమాచారం.