Cannes 2022 : సినీ ప్రపంచం అండగా నిలవాలి.. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌కీ ప్రసంగం

కాన్స్ చిత్రోత్సవాల సందర్భంగా జెలెన్స్‌కి మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా యుక్రేనియన్లకు సినీ ప్రపంచం అండగా నిలవాలి, సంఘీభావం తెలపాలని.............

Cannes 2022 : సినీ ప్రపంచం అండగా నిలవాలి.. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌కీ ప్రసంగం

Zelensky

Cannes 2022 :  ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. 75వ కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌కీ వర్చువల్‌గా ప్రారంభం అయ్యే ముందు ఉపన్యాసం ఇచ్చారు. వీడియో లింక్ ద్వారా ఆయన ప్రసంగించారు. జెలెన్స్‌కీ తెరపై కనిపించగానే వేడుకల్లో పాల్గొన్న వారంత ఆయనకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు.

 

కాన్స్ చిత్రోత్సవాల సందర్భంగా జెలెన్స్‌కి మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా యుక్రేనియన్లకు సినీ ప్రపంచం అండగా నిలవాలి, సంఘీభావం తెలపాలని కోరారు. సినిమాలకు-వాస్తవికతకు మధ్య ఉన్న తేడాలపై, యుక్రెయిన్ సినిమాలపై జెలెన్స్‌కీ చాలా సేపు మాట్లాడారు. ఇక జెలెన్స్‌కీ ప్రసంగం తర్వాత అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.

Ali : ఒకప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి నార్త్ వాళ్ళని తెచ్చుకున్నాం.. ఇప్పుడు మనల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు..

12 రోజులపాటు జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో యుక్రెయిన్ నుంచి ‘ది నేచురల్ హిస్టరీ ఆఫ్ డిస్ట్రక్షన్’ అనే డాక్యుమెంటరీతో పాటు పలు యుక్రెయిన్‌కు చెందిన సినిమాలను ప్రదర్శించనున్నారు. ఇక ఈ ఫెస్టివల్ లో భారతదేశం నుంచి కూడా పలు సినిమాలని ప్రదర్శించనున్నారు. ఇప్పటికే పలువురు భారతీయ తారలు కాన్స్ వేదికపై సందడి చేస్తున్నారు.