Cannes 2022 : కాన్స్ ఫిలింఫెస్టివల్ లో షాకింగ్ సంఘటన.. అర్ధనగ్నంగా రెడ్ కార్పెట్ పై నినాదాలు..

  ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచ తారలు రెడ్ కార్పెట్ పై ఫోటోలకు పోజులిస్తున్న సమయంలో ఓ యువతి......

Cannes 2022 :  కాన్స్ ఫిలింఫెస్టివల్ లో షాకింగ్ సంఘటన.. అర్ధనగ్నంగా రెడ్ కార్పెట్ పై నినాదాలు..

Cannes2022

Cannes 2022 :  ఫ్రాన్స్ లో జరుగుతున్న ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచ తారలు రెడ్ కార్పెట్ పై ఫోటోలకు పోజులిస్తున్న సమయంలో ఓ యువతి పరిగెత్తుకుంటూ వచ్చి తన ఒంటి మీద బట్టలు తీసేసి రెడ్ కార్పెట్ పై అరుస్తూ అందర్నీ షాక్ కి గురి చేసింది. యుక్రెయిన్ కి చెందిన ఈ మహిళ తమ దేశంలో మహిళలు, యువతులపై రష్యా సైనికులు అత్యాచారాలు చేస్తున్నారు, వాటిని ఆపండి అంటూ నినాదాలు చేసింది. కొన్ని సెకన్ల పాటు అక్కడ గందరగోళం సృష్టించింది ఆ యువతి.

Bollywood : బాలీవుడ్ స్టార్ హీరోలపై కేసు నమోదు

వెంటనే అప్రమత్తమైన అక్కడి పోలీసులు, రక్షణ సిబ్బంది ఆమెపై బట్టలు కప్పి అదుపులోకి తీసుకున్నారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఆ యువతి శరీరంపై ఉక్రెయిన్‌ జెండా రంగులను వేసుకొని మాపై అత్యాచారం ఆపండి అంటూ నినాదాలు చేయడంతో ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మొదటి రోజు యుక్రెయిన్ అధ్యక్షుడు ప్రారంభ ఉపన్యాసం ఇచ్చిన సంగతి తెలిసిందే.