VJ Sunny : సన్నీకి అత్త అవ్వాల్సింది.. పిన్ని అయ్యాను
ఉమాదేవి ఆ ఇంటర్వ్యూలో సన్నీ గురించి మాట్లాడుతూ.. 'కళ్యాణ వైభోగమే' సీరియల్ మొదలు పెట్టినప్పుడు అందులో నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సీరియల్ లో హీరో ఎవరు అని అడిగితే సన్నీ అని.....
VJ Sunny : సినిమాల్లో, సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించిన ఉమాదేవి ‘కార్తీకదీపం’ సీరియల్ తో మరింత ఫేమ్ తెచ్చుకొని ఈ సీజన్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక షోలో మంచిగా ఉంటూనే ఒక్కోసారి అందరి మీద అరుస్తూ బాగా పాపులర్ అయింది. హౌస్‌లోని కంటెస్టెంట్స్ అంతా ఆమెతో గొడవలు ఎందుకు అని దూరంగానే ఉండేవారు. అయితే బిగ్ బాస్ నుంచి రెండోవారంలోనే వెళ్ళిపోయింది.
Samantha : పాన్ ఇండియా సినిమా.. ‘యశోద’గా సమంత…
ఇక హౌస్ లో మొదటి నుంచి కూడా సన్నీకి సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఈ షోకు రాకముందే సన్నీతో కలిసి ఓ సీరియల్ లో నటించడంతో అతడికి సపోర్ట్ చేస్తుంది. ఇటీవల ఉమాదేవి ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
Puneeth Rajkumar : గంధడ గుడి.. పునీత్ వైల్డ్‌లైఫ్ డ్యాక్యుమెంటరి టీజర్ రిలీజ్..
ఉమాదేవి ఆ ఇంటర్వ్యూలో సన్నీ గురించి మాట్లాడుతూ.. ‘కళ్యాణ వైభోగమే’ సీరియల్ మొదలు పెట్టినప్పుడు అందులో నన్ను సెలెక్ట్ చేశారు. ఆ సీరియల్ లో హీరో ఎవరు అని అడిగితే సన్నీ అని చెప్పారు. అప్పటికి నాకు ఇంకా సన్నీ తెలియదు. దీంతో మా ఇంట్లో సన్నీ ఎవరు అని అడిగితే నా పెద్ద కూతురు వీజే అని చెప్పింది. అతడికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పింది.
Bigg Boss 5 : సన్నీ-సిరి మధ్య లవ్ ట్రాక్.. సీరియస్ అవుతున్న షణ్ను..
సీరియల్ స్టార్ట్ అయ్యాక నేను వెళ్లి సన్నీతో మాట్లాడాను. అబ్బాయి బాగున్నాడు, మా పెద్దమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని అనుకున్నాను. కానీ అంతలోనే మా పెద్దమ్మాయి వచ్చి సన్నీని అన్న అని పిలిచింది. ఆరోజు నుంచి సన్నీ నా కూతుళ్లను చెల్లెలుగా, వీళ్లు అతడిని అన్నగా ఫిక్సయిపోయారు అని చెప్పింది. దీంతో సన్నీకి అత్త అవుదామనుకున్న నేను పిన్ని అయ్యాను అని తెలిపింది. ప్రస్తుతం బిగ్ బాస్ లో సన్నీ మంచి ఫామ్ లో ఉండటంతో ఈ వార్త వైరల్ అవుతుంది.